Posted on 2026-05-18 15:51:54
బీఆర్ఎస్ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..
బండి సంజయ్, బండి భగీరథ్ ఫోటోతో కూడిన భారీ ప్లెక్సీ తో నిరసన..
డైలీ భారత్, సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో మరోసారి రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక బీఆర్ఎస్ భవన్ వద్ద భారీ ఫ్లెక్సీతో కాకరేపింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఆయన కుమారుడు భగీరథ్‌లకు సంబంధించిన ఒక భారీ ఫ్లెక్సీని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై ఉంచి బైఠాయించారు. బీజేపీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రోడ్డుపై ఉన్న ఫ్లెక్సీని తొలగించేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే బీఆర్ఎస్ శ్రేణులు పోలీసులను అడ్డుకొని వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.పోలీసులు నిరసనకారులను చెల్లాచెదురు చేశారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలను, కార్యకర్తలన వాహనాల్లోకి ఎక్కించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ, ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ స్థానికంగా నెలకొంది.
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >