| Daily భారత్
Logo




మెడికల్ షాపుల బంద్‌కు సహకరించండి...

News

Posted on 2026-05-18 15:49:39

Share: Share


మెడికల్ షాపుల బంద్‌కు సహకరించండి...

కోనరావుపేట మండలాధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ పిలుపు...

డైలీ భారత్, కొనరావుపేట: ​ఆల్ ఇండియా కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, తెలంగాణ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఈ నెల 20న బుధవారం నిర్వహించే దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌కు ప్రజలు సహకరించాలని కోనరావుపేట మండల మెడికల్ షాప్ అసోసియేషన్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ కోరారు. మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో అసోసియేషన్ సభ్యులు సమావేశమై బంద్‌కు మద్దతు ప్రకటించారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా మెడికల్ వ్యాపారులు ఈ ఒక రోజు నిరసన బంద్‌లో పాల్గొంటున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అక్రమ ఈ-ఫార్మసీల వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందన్నారు. భౌతిక ధృవీకరణ లేకుండా ఆన్‌లైన్‌లో మందులు విక్రయించడం, AI ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్ల ద్వారా యాంటీబయాటిక్స్, అలవాటుగా మారే మందులు విక్రయించడం వల్ల యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వంటి తీవ్ర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్ సమయంలో జారీ చేసిన తాత్కాలిక సడలింపుల నోటిఫికేషన్ G.S.R. 220(E)ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఈ-ఫార్మసీల నోటిఫికేషన్ G.S.R. 817(E)ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ​పెద్ద కార్పొరేట్ సంస్థలు ఆన్‌లైన్‌లో ఇస్తున్న భారీ డిస్కౌంట్ల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్న మెడికల్ షాపుల మనుగడ సాగడం కష్టంగా మారిందని, అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఈ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తులో నిరవధిక ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. బంద్ సందర్భంగా కోనరావుపేట ఎస్సై ప్రశాంత్ రెడ్డికి, ఎంపీడీవో, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, గంగాధర్, సమ్మయ్య, దామోదర్, లక్ష్మీరాజం, మధుకర్ రెడ్డి, రాములు, లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >