| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : సైకాలజిస్ట్ పున్నంచందర్

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి : సైకాలజిస్ట్ పున్నంచందర్

డైలీ భారత్, సిరిసిల్ల:ప్రపంచ మానసిక ఆరోగ్య వారోత్సవాల్లో భాగంగా మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల, సిరిసిల్ల ఆధ్వర్యంలో గురువారం సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్‌లో కార్మికులకు మానసిక ఆరోగ్య పరిరక్షణపై అవగాహన మరియు కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు మానసిక ఆరోగ్య ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ - శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని, పని ఒత్తిడి, ఆర్థిక, కుటుంబ సమస్యలు, నిద్రలేమి, అధిక ఆలోచనలు, ఆందోళన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.

విచారం, చిరాకు, భయం, నిద్ర-ఆకలిలో మార్పులు, ఏకాగ్రత లోపం, పనిపై ఆసక్తి తగ్గడం, ఒంటరిగా ఉండాలనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని, తొలి దశలోనే గుర్తించి నిపుణుల సహాయం తీసుకోవాలని సూచించారు.

మానసిక సమస్యలను బలహీనతగా భావించవద్దని, ప్రతిరోజూ తగినంత నిద్ర, వ్యాయామం, పోషకాహారం, వ్యసనాలకు దూరం, కుటుంబం-స్నేహితులతో సమస్యలు పంచుకోవడం వంటి ఆరోగ్యకర అలవాట్లు పాటించాలని తెలిపారు.

సమస్యలు ఉన్నవారు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, సిరిసిల్లను సంప్రదించాలని కోరారు.

కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు మాట్లాడుతూ ప్రభుత్వ నేతన్న భీమా, త్రిఫ్ట్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.

Previous ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత
ADVERTISEMENT