డైలీ భారత్, హైదరాబాద్:ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత నానా పటేకర్ (75) కన్నుమూశారు. గోవాలోని దోనా పౌలాలోని తన నివాసంలో గుండెపోటుతో తెల్లవారుజామున 5:20 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నానా పటేకర్ ఇంట్లో అపస్మారక స్థితిలో పడిపోయారు. వెంటనే మణిపాల్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసి బతికించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.1951 జనవరి 1న మహారాష్ట్రలోని మురుద్-జంజీరాలో జన్మించిన విశ్వనాథ్ పటేకర్.. నానా పటేకర్ గా సినీ రంగంలో ఎదిగారు. 1978లో “గమన్” సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టారు.పరిందా, క్రాంతివీర్, అబ్ తక్ ఛప్పన్, వెల్కమ్, రాజనీతి, నటసామ్రాట్ వంటి చిత్రాల్లో తన విలక్షణ నటనతో 3 జాతీయ అవార్డులు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2013లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరించింది.సినిమాలతో పాటు రైతుల కోసం “నామ్ ఫౌండేషన్” ద్వారా ఎంతో సామాజిక సేవ చేశారు. నాలుగు రోజుల క్రితం గోవాలో సమ్రాట్ క్లబ్ ఇంటర్నేషనల్ కార్యక్రమంలో చివరిసారిగా పాల్గొన్నారు.గోవా సీఎం ప్రమోద్ సావంత్ సంతాపం వ్యక్తం చేస్తూ "మంచి మిత్రుడిని కోల్పోయాను, గోవాలో ఆయన సామాజిక సేవ మరువలేనిది" అని అన్నారు. ఆయన కుమారుడు మల్హర్ పటేకర్ పూణే నుండి గోవా బయలుదేరారు.పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియల వివరాలు వెల్లడించనున్నారు.
News
ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత