| Daily భారత్
Logo




ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

News

Posted on 2026-05-15 16:39:22

Share: Share


ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట హాజరైన డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

డైలీ భారత్, కామారెడ్డి: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతిపక్ష నేతలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేసినట్లు వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది.

ఈ కేసులో భాగంగా కామారెడ్డి జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్‌కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయగా, ఆయన శుక్రవారం హైదరాబాద్  కమాండ్, కంట్రోల్ టవర్స్‌లోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు.

ఉదయం 11 గంటలకు, గంప ప్రసాద్ సిట్ ఎదుట హాజరై తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. 

ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న పరిణామాలు, ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన అనుమానాలు, వ్యక్తిగత సమాచారం లీక్ అంశాలపై అధికారులు ప్రశ్నలు అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు.

విచారణ అనంతరం గంప ప్రసాద్ మాట్లాడుతూ,

నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సిట్ అధికారులు చెప్పే వరకు నాకు తెలియదు. ఫోన్ ట్యాపింగ్ వల్ల నా వ్యక్తిగత సమాచారం బహిరంగమై, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగింది. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాను. నా వాంగ్మూలాన్ని వారు రికార్డు చేసుకున్నారు అని తెలిపారు.

గంప ప్రసాద్ వెంట సిట్ కార్యాలయానికి పీసీసీ రాష్ట్ర కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, చాట్ల రాజేశ్వర్, మండల అధ్యక్షులు నౌసిలాల్ నాయక్, అంకం కృష్ణారావు, పల్లె రమేష్ గౌడ్, పాత రాజు, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, సుతారి రమేష్, మహమ్మద్ సలీం, కిరణ్, రవీందర్ గౌడ్, వడ్ల సురేష్, టింకు భరత్, ఎజాస్, సుఫియాన్, డేవిడ్, రింకు తదితర కాంగ్రెస్ నాయకులు వెళ్లి సంఘీభావం తెలిపారు.

Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >