| Daily భారత్
Logo




10 వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

News

Posted on 2026-05-13 19:23:45

Share: Share


 10 వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం

డైలీ భారత్, కామారెడ్డి: ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 2026 లో 10 వ తరగతి పరీక్షా ఫలితాల్లో 550 మరియు ఆ పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమం

550 మరియు ఆపైగా మార్కులు సాధించిన విద్యార్థులు వివరాలు ఈ నెల 18 లోపు తెలియజేయాలి

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 2026 10 వ తరగతి పరీక్షా ఫలితాల్లో 550 మరియు ఆ పైగా మార్కులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులకు అభినందన సన్మాన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25 సోమవారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా కమిటీ తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించాలనే మంచి సంకల్పంతో మొట్టమొదటిసారిగా జిల్లా వ్యాప్తంగా 550 కి పైగా మార్పులు సాధించిన ఆర్యవైశ్య విద్యార్థులందరినీ సన్మానించడం జరుగుతుందని ఈ అభినందన సన్మాన కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత గుప్త, ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త,జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ డాక్టర్ దుద్దెల శ్రీనివాస్ విచ్చేసి విద్యార్థులను అభినందించడం జరుగుతుందని కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య విద్యార్థులు వారి యొక్క వివరాలను కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ బాలు 9492874006 నెంబర్ కి (వాట్సాప్ ద్వారా) తెలియజేయాలని సూచించారు. ఈనెల 18 వ తేదీ లోపు వచ్చిన విద్యార్థులకు మాత్రమే అభినందన సన్మాన కార్యక్రమం నిర్వహించబడుతుందని దీనిని విజయవంతం చేయడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సంఘాలు,వాసవి క్లబ్,పట్టణ వైశ్య సంఘాలు సహకరించి ఉత్తమ విద్యార్థులను మరింతగా ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వివరాలకు జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ 9849601438,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ 9440054065, కోశాధికారి కస్వ వెంకటేష్ 9848280665,ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతి 9885707042,ఎర్రం విజయ్ కుమార్ 9491461854 లను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక విభాగం అధ్యక్షులు ఎల్లంకి సుదర్శన్, సలహాదారులు మందుల రామచంద్రం లు పాల్గొనడం జరిగింది.

Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >