| Daily భారత్
Logo




మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

News

Posted on 2026-05-13 19:24:47

Share: Share


మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

డైలీ భారత్, కామారెడ్డి: సదాశివనగర్ మండలం ఉత్తనూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి పరిశీలించారు.

అనంతరం మాట్లాడుతూ, రైతుల నుండి మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

ప్రస్తుత ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కొనుగోలు ప్రక్రియను ఉదయం, సాయంత్రం వేళల్లో నిర్వహించాలని తెలిపారు. కేంద్రంలో తాగునీరు, నీడ, ORS ప్యాకెట్లు మరియు ఇతర మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు.

రైతులు తీసుకొచ్చిన మొక్కజొన్న నాణ్యత ప్రమాణాలను పరిశీలించి, తేమ శాతం నిబంధనల ప్రకారం ఉండేలా చూడాలని తెలిపారు. కొనుగోలు అనంతరం లిఫ్టింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేసి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

అలాగే ట్రాన్స్‌పోర్ట్‌కు సంబంధించి డీఎం మార్క్‌ఫెడ్ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తూ, రవాణా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే 5 వేల క్వింటాళ్ల మొక్కజొన్నను గోదాములకు తరలించడం జరిగిందని, మిగిలిన స్టాక్‌ను వచ్చే 10 రోజుల్లో పూర్తి స్థాయిలో తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అనంతరం మొక్కజొన్న తూర్పార పట్టే విధానాన్ని పరిశీలించి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ప్రక్రియ నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు, తూర్పార పట్టడం మరియు రవాణా ప్రక్రియలు సమన్వయంతో కొనసాగించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమం లో సహకార అధికారి రామ్మోహన్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >