| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

చూపు లేకుండా శిశువు జననం.. తల్లికి రూ.కోటి పరిహారం

చూపు లేకుండా శిశువు జననం.. తల్లికి రూ.కోటి పరిహారం

డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ కు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ గర్భధారణ సమయంలో చేయించుకున్న స్కానింగ్ పరీక్షల్లో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తప్పుడు నివేదికలు ఇచ్చారు. తీరా కాన్పు తర్వాత శిశువు రెండు కళ్లు లేకుండా జన్మించడంతో బాధితురాలు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కమిషన్ అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్, వైద్యుల నిర్లక్ష్యాన్ని తప్పుబడుతూ బాధితురాలికి రూ. కోటి నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కోసం రూ.34 వేలు చెల్లించాలని సంచలన తీర్పునిచ్చారు.

Previous నకిలీ పత్తి విత్తనాల విక్రయదారుల అరెస్టు
Next నూతన జిల్లా DFO ను కలిసిన కామారెడ్డి జిల్లా సామిల్ అండ్ టింబర్ డిపోల యాజమానుల సంఘం
ADVERTISEMENT