| Daily భారత్
Logo




అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

News

Posted on 2026-05-04 15:19:53

Share: Share


అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను  పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

• రూ:2 లక్షలు, 1- పిస్టల్ (2 రౌండ్స్), 1-ఎయిర్ గన్, 2-కత్తులు, 6-సెల్‌ఫోన్లు, టిప్పర్ స్వాధీనం..

• నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలింపు

• వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్

డైలీ భారత్, సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లా సురక్ష ప్రతినిధి: ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలోని మనూర్ ఎక్స్ రోడ్ వద్ద తేది 09/10-04-2026 మధ్య రాత్రి డీసీఎం వాహనం దొంగతనం జరిగినట్లు తెలిపారు. ఈ విషయమై నాగల్‌గిద్ద గ్రామానికి చెందిన ఫిర్యాదుదారు మాలిపాటిల్ దత్తు తేది 11-04-2026న ఉదయం 10:15 గంటలకు ఫిర్యాదు చేయడం జరిగింది. తన డీసీఎం వాహనం (నంబర్: ఎపి 28 టిఇ 3708)ను 09-04-2026న మధ్యాహ్నం 12 గంటలకు డ్రైవర్ గైనీ సునీల్ మనూర్ ఎక్స్ రోడ్ వద్ద పార్క్ చేసి గ్రామానికి వెళ్లగా, మరుసటి రోజు రాత్రి 9 గంటలకు వాహనం కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. ఈ మేరకు నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 84/2026, సెక్షన్ 305(బి) బిఎన్ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది. 

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, నారాయణఖేడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు సేకరించి, తేది 03-05-2026 రాత్రి 9:30 గంటలకు నారాయణఖేడ్ పట్టణంలోని పంచగామ కమాన్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించగా వారు:

1. మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్ (వయసు 53, డ్రైవర్, కుత్‌కట్‌పల్లి, హైదరాబాద్) 

2. మహమ్మద్ జాఫర్ అలీ (వయసు 55, డ్రైవర్, చాంద్రాయణగుట్ట, హైదరాబాద్) 

వారి వద్ద నుండి 1 పిస్టల్ (2 రౌండ్స్), ఒక ఎయిర్ గన్, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఇద్దరు వ్యక్తులు నదీమ్ ఖాన్, షేక్ ఐజాజ్, సయ్యద్ సయీద్, షేక్ నిజాం, మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్, గులాం రబ్బానీ, సలావుద్దీన్, బాబా, మొహ్సిన్ షా, రేహాన్ తదితరులతో కలిసి గ్యాంగ్‌గా ఏర్పడి సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో వాహన దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారు.

ఒక రాష్ట్రంలో వాహనాలను దొంగిలించి, మరో రాష్ట్రంలో విక్రయించడం ద్వారా పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా నేరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.

అరెస్ట్ చేయబడిన నిందితుల వివరాలు: మహమ్మద్ ఖుర్షీద్ అహ్మద్, మహమ్మద్ జాఫర్ అలీ, సయ్యద్ సయీద్, షేక్ నిజాం, మహమ్మద్ సలీం, మహమ్మద్ ఇర్షాద్ అహ్మద్ 

పరారీలో ఉన్న నిందితులు: నదీమ్ ఖాన్, షేక్ ఐజాజ్, గులాం రబ్బానీ, సలావుద్దీన్, బాబా, మొహ్సిన్ షా, రేహాన్. 

నిందితుల నుండి స్వాధీనం చేసిన సొత్తు: 

• 1-పిస్టల్ (2 రౌండ్స్)

• ఎయిర్ గన్

• కత్తులు – 2

• నగదు రూ. 2,00,000/-

• సెల్‌ఫోన్లు – 6

• టిప్పర్ వాహనం (ఎం.హెచ్ 22 ఎఎ 1413)

ఒప్పుకున్న కేసులు: మొత్తం 11 కేసులు (తెలంగాణ – 5, కర్ణాటక – 1, మహారాష్ట్ర – 5)లో వాహన దొంగతనాలు చేసినట్లు 

నిందితులు ఒప్పుకున్నారు.

గతంలో కూడా ఎ1- ఖుర్షీద్ అహ్మద్‌పై కర్ణాటక, హైదరాబాద్ పరిధిలో పలు వాహన దొంగతన కేసులు ఉన్నాయి.

A2 జాఫర్ అలీపై ఎన్.డి.పి.ఎస్ కేసులో జైలుకు వెళ్లిన చరిత్ర ఉంది.

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను అరెస్టు చేసి, ఈ కేసును ఛేదించిన సిసిఎస్ సంగారెడ్డి బృందం, నారాయణఖేడ్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

ఈ ప్రెస్ మీట్ నందు అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివ కుమార్, ప్రసాద్ రావ్, నారాయణఖేడ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >