| Daily భారత్
Logo




హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

News

Posted on 2026-05-04 15:21:37

Share: Share


హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నిందితుడికి ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది.

కేసు వివరాల ప్రకారం, 2025 సంవత్సరంలో మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్‌ఎస్ సెక్షన్ 103 కింద క్రైమ్ నెం. 304/2025గా కేసు నమోదు చేయబడింది. అనంతరం ఈ కేసు ఎస్‌సి నెం. 136/2025గా కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో ఫిర్యాదుదారు వనగల్ల గుట్టయ్య (43), తండ్రి ఇదయ్య, వృత్తి టిఫిన్ సెంటర్, నివాసం నర్సింహులగూడెం గ్రామం, నెల్లికుదురు మండలం. నిందితుడు సంపత్ శ్రీను (40), తండ్రి వీరస్వామి, వృత్తి మేస్త్రీ పని, మహబూబాబాద్.

ఈ కేసును మహబూబాబాద్ ప్రధాన జిల్లా మరియు సెషన్స్ కోర్టులో న్యాయమూర్తి ఎండీ అబ్దుల్ రఫీ విచారించి నిందితుడిని దోషిగా నిర్ధారించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 235(2) ప్రకారం నిందితుడికి జీవిత ఖైదు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

కేసు విచారణలో ప్రత్యేక ప్రజా అభియోగాధికారి కొంపల్లి వెంకటయ్య వాదనలు వినిపించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎన్. జీనత్ (ఎస్‌ఐ, డీసీఆర్‌బీ) వ్యవహరించారు.

దర్యాప్తు అధికారులుగా టి. ప్రశాంత్ బాబు (ఎస్‌ఐ, మహబూబాబాద్ టౌన్) కేసును ప్రారంభించి, అనంతరం పి. సర్వయ్య (సీఐ, మహబూబాబాద్ రూరల్) మరియు జి. మహేందర్ రెడ్డి (ఇన్‌స్పెక్టర్, మహబూబాబాద్ టౌన్) దర్యాప్తు కొనసాగించి సాక్ష్యాధారాలను సమగ్రంగా సేకరించి కోర్టుకు సమర్పించారు. కేసు పర్యవేక్షణను ఎన్. తిరుపతి (డీఎస్పీ, మహబూబాబాద్) మరియు జి. మహేందర్ రెడ్డి నిర్వహించారు.

కేసు డాక్యుమెంటేషన్ బాధ్యతలను బుక్యా రవీందర్ (పిసి-537, సీడీఓ) నిర్వహించారు.

సాక్ష్యాధారాల బలం, పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ సమర్థవంతమైన వాదనలు కారణంగా నిందితుడికి శిక్ష పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు నేరాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేసి, సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు సహకరించాలని కోరారు.

Image 1

ఎస్సీ కమిషన్ అధికారాలకు సుప్రీంకోర్టు పరిమితి

Posted On 2026-07-30 05:25:04

Readmore >
Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >
Image 1

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:08:30

Readmore >
Image 1

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు

Posted On 2026-07-29 16:07:12

Readmore >
Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >