| Daily భారత్
Logo




రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

News

Posted on 2026-05-04 14:54:03

Share: Share


రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి  చిక్కిన జూనియర్ అసిస్టెంట్

డైలీ భారత్, హైదరాబాద్: రాష్ట్రంలోఅవినీతి నిరోధక శాఖ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని శాఖల్లో అధికారులు, సిబ్బంది తీరు మాత్రం మారడం లేదు. డబ్బులిస్తేనే పనవుతుందని, ఫైళ్లు కదులుతాయని మధ్యవర్తులతో చెప్పిస్తున్నారు. అడిగినంత సమర్పించుకుంటేనే పని జరుగుతుందని వసూళ్ల దందా సాగిస్తున్నారు. తాజాగా బోరబండలో లంచం తీసుకుంటూ ఓ అధికారిణి ఏసీబీ అధికారులకు రెడ్ ​హ్యాండెడ్​గా చిక్కారు. రోజుల వ్యవధిలోనే పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడటం కలకలం రేపుతోంది.

బోరబండ జీహెచ్ఎంసీ ఆఫీసులో ఏసీబీ  తనిఖీలు నిర్వహించింది. జూనియర్ అసిస్టెంట్ శ్రీలత రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేసిందని, ఇవాళ ఓ సూపర్ మార్కెట్ వద్ద జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని అధికారులు వివరించారు.


#acb #acb Telangana #borabanda

Image 1

కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్

Posted On 2026-07-28 17:42:20

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు

Posted On 2026-07-28 17:30:20

Readmore >
Image 1

మూడోసారీ ఆడపిల్లేనని అబార్షన్ ఆ తరవాత మహిళ మృతి

Posted On 2026-07-28 17:22:38

Readmore >
Image 1

మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం

Posted On 2026-07-28 17:21:37

Readmore >
Image 1

భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు

Posted On 2026-07-28 17:20:49

Readmore >
Image 1

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతలపూడి యుగంధర్ మృతి

Posted On 2026-07-28 17:11:57

Readmore >
Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >