| Daily భారత్
Logo




మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం

News

Posted on 2026-04-27 07:06:06

Share: Share


మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లో తెలంగాణ రైతు సంఘం (ఏ ఐ కే ఎస్ ) రాష్ట్ర మూడవ మహాసభలను విజయవంతంగా ముగించుకుని మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి  బోడంకి చందు కామారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి రఘుపతి మధుసూదన్ చర్ల మండలం మొగలపల్లి గ్రామానికి చేరుకుని,  సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు చింతూరి వెంకటరావు తన కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సన్మానించారు.

చింతూరు వెంకట్రావు  94 ఏళ్ల జీవిత ప్రయాణంలో సమాజహితం కోసం నిరంతరం పోరాడుతూ, పీడిత ప్రజల హక్కుల సాధనలో అగ్రగామిగా నిలిచినారు, వెంకటరావు గ్రామీణ ప్రజలకు ఆదర్శంగా నిలిచారని నాయకులు కొనియాడారు. ఆయన సేవలు కార్మిక, కర్షక లోకానికి మార్గదర్శకంగా నిలిచాయని, మార్క్సిస్టు సిద్ధాంతాలను ఆచరణలో చూపిన మహనీయుడని ప్రశంసించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్లెల బాలకృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యుడు బొండంకి చందు, నాయకుడు రఘుపతి మధుసూదన్ తదితరులు శాలువాలతో సన్మానం చేసి, గురువర్యులకు అక్షర కుసుమాలు అర్పించారు. వారి సందేశంలో “చింతూరి వెంకటరావు  జీవితం ఒక పోరాట గాథ, ఒక చైతన్య జ్యోతి అని ప్రశంసించారు,

ఈ కార్యక్రమంలో ఆయన ఏకైక కుమారులు చింతూరి రజనీకాంత్, కూతుర్లు హేమలత,నాగమణి, మనుమరాలు అరుణకుమారి , జరీనా, మనుమండ్లు మిధున్ చక్రవర్తి, మల్లికార్జున రావు, దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >