Posted on 2023-09-21 17:35:30
డైలీ భారత్, సిరిసిల్ల: సమగ్ర శిక్ష ఉద్యోగు లను విద్యాశాఖలో విలీనం చేసి క్రమబద్ధీకరణ చేపట్టాలని గత 20 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో చేపట్టిన నిరసన దీక్షలను గురువారం విరమించారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తో, గౌరవ MLC కల్వకుంట్ల కవిత తో తెలంగాణ ప్రణాళిక సంఘం అధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తో జరిగిన చర్చల అనంతరం ఈ క్రింది డిమాండ్స్ నెరవేర్చుతామని చెప్పడం జరిగింది.
1. క్రమబద్ధీకరణ గురించి గౌరవ ముఖ్యమంత్రి తో చర్చించడం జరుగుతుందని కనీస వేతన స్కేల్ను వెంటనే అమలు చేయడం.
2. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు కల్పించడం.
3. PTI (part Time instructure)కు 12 నెలల వేతనం ఇవ్వడం.
4. జీవిత బీమా మరియు ఆరోగ్య బీమా కల్పించడం.
5. గత 20 రోజులుగా చేపట్టిన నిరసన దీక్షలకు సైతం వేతనం ఇవ్వడం.
కనీస వేతన స్కేల్ గురించి గౌరవ విద్యాశాఖ మంత్రి విద్య శాఖ కమిషనర్ శ్రీమతి దేవసేన తో ఫోన్లో సంప్రదించి MTS సంబంధించిన నోట్ ఫైల్ తయారు చేయమని ఆదేశాలు ఇచ్చారు. కావున ప్రభుత్వం నుండి ఖచ్చితమైన హామీలు వచ్చినందున, ఇచ్చిన హామీని నెరవేరుస్తారని నమ్మకంతో ఈ నిరసన దీక్షలను తాత్కాలికంగా విరమింప చేస్తున్నాము.
నిరసన దీక్షలకు సహకరించిన వివిధ ఉపాధ్యాయ సంఘాలకు ఉపాధ్యాయులకు వివిధ రాజకీయ పార్టీలకు సామాజిక సంఘాల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు అండగా తమ కలంతో మా గలాన్ని వినిపించేందుకు వారదులుగా నిలిచిన ప్రింట్ మీడియా పాత్రికేయులకు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఇట్లు ..
సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల జేఏసీ రాజన్న సిరిసిల్ల జిల్లా
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >