| Daily భారత్
Logo




“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

News

Posted on 2026-04-09 07:56:24

Share: Share


 “ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

డైలీ భారత్ మహ్మదాబాద్: జిల్లా ఎస్పీ డి.జానకి,IPS. ఆదేశాల మేరకు మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని "కంచన్ పల్లి గ్రామంలో “ప్రజాభద్రత–పోలీసు బాధ్యత” కార్యక్రమం సురక్ష పోలీస్ కళాబృందం, AHTU Team, మరియు షిటీమ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఆటపాట మాటలతో నిర్వహించబడింది.

కార్యక్రమానికి హాజరైన మహ్మదాబాద్ SI శేఖర్ రెడ్డి మాట్లాడుతూ

స్కూళ్ళు కాలేజీలు గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు.

“పోలీసుల ఉనికి మీ భద్రత కోసం" చట్టపరంగా జీవించే వారు భయపడాల్సిన అవసరం లేదు.”

“వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం.”

అలాంటి అసాంఘిక శక్తులను కట్టడి చేయడంలో పోలీసులు అహర్నిశలు పనిచేస్తూనే ఉన్నారు.

“రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు అన్నివేళలా పోలీసు రికార్డులో ఉంటారు – ఇది జీవితాంతం మచ్చ.” వారికే కాదు వారి తదనంతరం వారసులకు కూడా"

“కేసుల్లో ఇరుక్కుంటే ఉద్యోగాలు, పాస్‌పోర్ట్, విదేశీ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.”

అలాంటి వారికి ఇంటా బయట కనీస మర్యాదలు విలువలు లేకుండా పోతాయి.

“మహిళల పట్ల గౌరవం తప్పనిసరి – వేధింపులపై శిక్షలు తీవ్రంగా ఉంటాయి.”

ముఖ్యంగా బాలికలు చదువుకునే వయసులో ప్రేమలు పెళ్ళిళ్ళు అని మోహ వ్యామొహాలకు లోనై చిన్న చిన్న ఆకర్షణలకు గురై విలువైన జీవితాన్ని, భవిష్యత్తును పాడుచేసుకోవద్దని అన్నారు.

 మహిళలు విధ్యారినులపై ఎవరైనా వేధింపులకు పాల్పడితే షిటీమ్ కొండంత అండగా ఉంటుంది.

షిటీమ్ నం:8712659365

AHTU నం:8712680066

సమాచారం ఇచ్చి సహాయం పొందండి అన్నారు.

బాధిత బాలికలకు మహిళలకు భరోసా, సఖీ సెంటర్ల ద్వారా మానసిక స్థైర్యాన్ని కల్పిస్తున్నాము.

“సైబర్ మోసాలకు లొంగకండి, ఆశలకు బలి కాకండి.”

ఒకవేళ సైబర్ మోసానికి గురై నష్టపోయినప్పుడు సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 సంప్రదించి సహాయం పొందండి అన్నారు.

“డ్రగ్స్, గంజాయి, మద్యం, పేకాట – ఇవి జీవితాలను నాశనం చేస్తాయి.”

 డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాల తయారీ సరఫరా వినియోగం ఎక్కడైనా జరుగుతుంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి.

సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాము.

“రోడ్డు భద్రత పాటించాలి – మద్యం సేవించి వాహనాలు నడపకండి.”

“యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి. వారికి పెద్దలు ఆదర్శంగా ఉండి మహబూబ్ నగర్ జిల్లాను నేర రహిత జిల్లాగా మార్చాలన్న జిల్లా ఎస్పీ డి.జానికి IPSసంకల్పాన్ని వివరించారు. 

ప్రజలతో పోలీసుల భాగస్వామ్యం ద్వారా సమాజ శాంతి భద్రతలు మెరుగుపడతాయని, సమస్యలు ఉన్నచో నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాజశేఖర్, ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యులు, షిటీమ్ అధికారి జయరాణి ASI,AHTU టీమ్ అధికారి సక్రిబాయి ASI, జ్యోతి HC, వరప్రసాద్ PC,సురక్ష పోలీసు కళాబృందం సభ్యులు డి.రాములు, బి జగదీష్, బాలరాజు గ్రామ ప్రజలు యువకులు మహిళలు విద్యార్థులు పాల్గొన్నారు.

Image 1

సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ

Posted On 2026-08-01 14:12:57

Readmore >
Image 1

వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీలు

Posted On 2026-08-01 14:10:03

Readmore >
Image 1

సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న

Posted On 2026-08-01 07:48:28

Readmore >
Image 1

నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు

Posted On 2026-08-01 07:45:01

Readmore >
Image 1

ఘనంగా హిందీ కవి మున్షీ ప్రేమచంద్ జయంతి నిర్వహణ

Posted On 2026-08-01 05:11:18

Readmore >
Image 1

మద్దిశెట్టి ఫిర్యాదు పై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందన

Posted On 2026-07-31 14:29:33

Readmore >
Image 1

ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి

Posted On 2026-07-31 14:28:07

Readmore >
Image 1

నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్

Posted On 2026-07-31 14:26:32

Readmore >
Image 1

ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు

Posted On 2026-07-31 13:26:11

Readmore >
Image 1

లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..

Posted On 2026-07-31 12:56:48

Readmore >