డైలీ భారత్, చెన్నై: ఎన్నికల కమిషన్ (EC) ఆదేశాల మేరకు తమిళనాడు ప్రధాన కార్యదర్శి ఎన్.మురుగానందం ను బదిలీ చేశారు. ఆయన స్థానంలో తమిళనాడు క్యాడర్ ఏపీ కి చెందిన సీనియర్ అధికారి ఎం.సాయికుమార్ ను రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు వెలువడగా, ఎం.సాయి కుమార్ అదే సాయంత్రం చెన్నై సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన ఈ మార్పు ఎన్నికల వేళ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన పరిపాలనా మార్పులలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సాయి కుమార్, ఎన్నికల నిర్వహణతో పాటు ప్రభుత్వ యంత్రాంగ సమన్వయంపై దృష్టి సారించనున్నట్లు సమాచారం.
రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల బదిలీలు సాధారణమే అయినప్పటికీ, ప్రధాన కార్యదర్శి స్థాయిలో జరిగిన ఈ మార్పు ప్రాధాన్యతను సంతరించుకుంది.
#TamilnaduNews #ChiefSecretary