Posted on 2026-04-08 22:58:46
ఘనంగా సురక్షిత మాతృత్వ దినోత్సవం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మార్చి 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న ఆరోగ్య అవగాహన వారోత్సవాలలో భాగంగా బుధవారం ఆరోగ్య శాఖ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల అధ్వర్యంలో ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో ఏర్పాటు చేసిన సురక్షిత మాతృత్వ దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... పూర్వకాలంలో శారీరక వ్యాయామం ఉండేదని, కానీ మారుతున్న అలవాట్లకు అనుగుణంగా శారీరక వ్యాయామం తగ్గిందని, దీనికి తోడు మానసిక ఒత్తిడి ప్రతి ఒక్కరిలో పెరగడంతో చిన్న వయస్సులోనే వాధ్యులబారిన పడటం జరుగుచున్నదని అన్నారు. నేటి సమాజంలో సంపద కన్నా ఆరోగ్యమే ముఖ్యమని, ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు. గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు, సరైన పోషకాహారం తీసుకుంటూ ఆశ వర్కర్ల సహాయంతో మెరుగైన వైద్య సేవలు పొందాలని, ప్రభుత్వ ఆసుపత్రిల లో జరుగుతున్న ప్రసవాలు రంగారెడ్డి జిల్లాలో 57% ఉందని తెలిపారు. ఎక్కువ మొత్తంలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, శిశు మరణాల రేటును పూర్తిగా తగ్గించాలని వైద్య అధికారులకు సిబ్బందికి సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఒక మహిళకు గర్బ నిర్దారణ అయిన నాటి నుండి ప్రసవం అయ్యే వరకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర, జిల్లాలోనే కాకుండా గ్రామీణ ప్రాంతాలతో కూడా ప్రబలుతున్న డ్రగ్స్ సంస్కృతిని గురించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎంలకు సూచించారు.
అనంతరం ఎలిమినేడు ప్రాథమిక కేంద్రంలో హెచ్ పి వి వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి వాక్సిన్ వేసుకున్న వారికి సర్టిఫికేట్ అందచేశారు. ఈ వ్యాక్సిన్ వల్ల మహిళల్లో సాధారణంగా వచ్చే గర్భాశయ ముఖ క్యాన్సర్ నుండి నివారించడానికి వాడతారని తెలిపారు ఎచ్ పి వి అనే వైరస్ వల్ల వచ్చే ఇతర క్యాన్సర్లను తగ్గిస్తుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు ఆరోగ్యాన్ని రక్షిస్తుందని, 9 నుండి 14 సంవత్సరాల బాలికలకు అత్యంత మంచిదని తెలిపారు. ఈ టీకా పూర్తిగా సురక్షితమైనదని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించినదని, జిల్లా వైద్యం మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని తల్లిదండ్రులు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో జరుగుతున్న ప్రసూతి సేవలు మరియు ప్రసవానంతర సేవలు సంపూర్ణంగా అందిస్తున్నామని, జిల్లాలో మాతృ మరణాలు సంఖ్య గణనీయంగా తగ్గిందని , హెచ్ పి వి హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వ్యాక్సిన్ రంగారెడ్డి జిల్లాలో 22 సెంటర్లలో ప్రారంభించినట్లు జిల్లా వైద్యమరియు ఆరోగ్యశాఖ అధికారి రంగారెడ్డి జిల్లా డాక్టర్ లలితా దేవి తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ యాదమ్,పిడి డి ఆర్ డి ఓ మరియు సీడీపీఓ శ్రీలత, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ రాధిక డాక్టర్ పూనం, డిప్యూటీ డి ఎం హే చ్ ఓ డాక్టర్ లక్ష్మీప్రసన్న, వైద్యాధికారులు డాక్టర్ మోహన్ డాక్టర్ రాజలక్ష్మి డాక్టర్ సంతోషి డెమో శ్రీనివాసులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >
జిల్లా లో 30, 30(ఎ) పోలీసు యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఐ.పి.ఎస్
Posted On 2026-05-31 19:22:44
Readmore >
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ జన్మదిన వేడుకలు
Posted On 2026-05-31 18:45:35
Readmore >
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >