| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 న మెగా రక్తదాన శిబిరం

సామాజిక సేవతో మహనీయులను స్మరించుకుందాం

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి రక్తదాతల సమూహం మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) ల ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం సహకారంతో,రెడ్ క్రాస్ సొసైటీ, యువజన సంఘాలు,స్వచ్ఛంద సంస్థల సహకారంతో భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14 వ తేదీ మంగళవారం రోజున జిల్లా కేంద్రంలోని కర్షక్ బి.ఎడ్ కళాశాలలో ఉదయం 9 గంటల నుండి తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసే మొదటి 200 మంది రక్తదాతలకు హెల్మెట్లను అందజేయడం జరుగుతుందని అన్నారు. మహనీయుల జయంతులు స్ఫూర్తిదాయకంగా సామాజిక సేవలో భాగస్వాములుగా నిలవాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి అంబేద్కర్ కు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో ఐ వి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు జమీల్ అహ్మద్,ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న,డాక్టర్ వేద ప్రకాష్,డాక్టర్ పుట్ల అనిల్ గంప ప్రసాద్ లు పాల్గొనడం జరిగింది.

Previous వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Next గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
ADVERTISEMENT