| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

సర్వే చేయండి ప్రజావాణిలో బాధితుని మొర

సర్వే చేయండి ప్రజావాణిలో బాధితుని మొర

డైలీ భారత్, కామారెడ్డి: సర్వే చేయాలని రెండుసార్లు మీ సేవలో చలాన్స్  కట్టడం జరిగిందని, సర్వేయర్  వచ్చి సర్వే చేయడం లేడని జిల్లా కలెక్టరేట్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన భవాని పేట గ్రామానికి చెందిన గంగని చిన్న నర్సింలు. ఈ సందర్భంగా గంగాని చిన్న నర్సింలు మాట్లాడుతూ మా యొక్క సర్వేనెంబర్ 841/23 లో 2 ఎకరాల 37 గుంటల భూమి ఉందని, సర్వే చేయాలని రెండు సార్లు  మీ సేవలో చలాన్ కట్టి పాల్వంచ ఎమ్మార్వో కార్యాలయంలో ఇవ్వడం జరిగిందని, చలాన్స్ కట్టి నాలుగైదు నెలలు అవుతుందని, సర్వేయర్ మాభూమి వద్దకు వచ్చి  వెళ్లిపోవడం జరిగింది గాని , మాభూమిలో సర్వే చేయడం లేడని ఇటి విషయం పైన ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా వెంటనే అధికారులు నా భూమిలో సర్వే చేయించాలని కోరుతున్నాను అన్నారు.

Previous పోలీసులు వేధిస్తున్నారని HRC కార్యాలయం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
Next గురుకులాల్లో 48 సీట్లు సాధించిన సాయి ఎక్సలెంట్ విద్యార్థులు
ADVERTISEMENT