Posted on 2026-04-07 09:38:49
ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ పిలుపు
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో బద్దం ఎల్లారెడ్డి నగర్, సిరిసిల్లలో “మైండ్ కేర్ అవగాహన కార్యక్రమం” ప్రముఖ సైకాలజిస్ట్ కనుకుంట్ల పున్నంచందర్ నిర్వహించారు.
ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యంపై కార్మికుల్లో అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఈ సందర్భంగా సైకాలజిస్ట్ పున్నంచందర్ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో మారుతున్న జీవన విధానం, ఉద్యోగ ఒత్తిడులు, ఆర్థిక సమస్యలు, సమయాభావం, డిజిటల్ ప్రభావం వంటి కారణాల వల్ల కుటుంబ సంబంధాలలో విభేదాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్న చిన్న అపార్థాలు, ఇరువురి మధ్య అహం వల్ల పెద్ద సమస్యలుగా మారుతున్నాయని అన్నారు.
మనస్సు విప్పి మాట్లాడుకుంటే విభేదాలు పోయి అన్యోన్యత పెరిగి కుటుంబ బంధాలు బలపడుతాయని తెలిపారు.
కుటుంబ వివాదాల పరిష్కారం కోసం మైండ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కార్మికులకు వివరించారు.
ఫ్యామిలీ కౌన్సెలింగ్ ద్వారా భార్యాభర్తల మధ్య పరస్పర కమ్యూనికేషన్ మెరుగుపడుతుందనీ, భావోద్వేగ నియంత్రణ పెరిగి కోపం, ఆవేశం తగ్గి సమస్యలను శాంతంగా పరిష్కరించే నైపుణ్యం అభివృద్ధి చెందుతుందనీ అన్నారు
కుటుంబంలో ప్రేమ, గౌరవం, నమ్మకం పెరుగుతాయని తెలిపారు.
ప్రస్తుతం చాలా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరుగుతున్నాయని, ఈ పరిస్థితుల్లో మూడవ వ్యక్తి అయిన సైకాలజిస్ట్ మార్గదర్శకత్వం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.
కుటుంబ సమస్యలను ఒంటరిగా భరించకుండా, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సులభంగా పరిష్కారం పొందవచ్చని సూచించారు.
మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను వివరిస్తూ, శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సమానంగా కాపాడుకోవాలనీ అన్నారు.
మానసిక ప్రశాంతత ఉంటేనే కుటుంబ జీవితం సుఖంగా ఉంటుందనీ తెలిపారు.
కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. థ్రిఫ్ట్, నేతన్న బీమా పథకాల్లో ప్రతి కార్మికుడు చేరాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఫెసిలిటేటర్ వేముల మార్కండేయులు, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమ, కార్మికులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >