| Daily భారత్
Logo




పబ్లిక్ న్యూసెన్స్ కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురికి జైలు శిక్ష

News

Posted on 2026-04-07 03:20:15

Share: Share


పబ్లిక్ న్యూసెన్స్ కలిగించి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ముగ్గురికి జైలు శిక్ష

డైలీ భారత్, హైదరాబాద్: చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేస్తూ, విధుల్లో ఉన్న పోలీసు అధికారులను అడ్డుకున్న ముగ్గురు వ్యక్తులకు గౌరవనీయ నాంపల్లి కోర్టు (I స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్) 2 రోజుల జైలు శిక్ష మరియు తలా ₹500/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నిందితులైన రజాక్ పాషా (25), హాజీ బిన్ అబ్దుల్లా (29), మరియు మహ్మద్ సాహిల్ (24) ప్రజలకు అసౌకర్యం కలిగిస్తూ విఘాతం కలిగిస్తున్నారు. చార్మినార్ ఎస్.ఐ బి. ప్రవీణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి వారిని ప్రశ్నించగా, నిందితులు సహకరించకుండా దురుసుగా ప్రవర్తించారు. ముఖ్యంగా హాజీ బిన్ అబ్దుల్లా అనే వ్యక్తి పోలీసులపైకి దూసుకువచ్చి, వారి విధులకు ఆటంకం కలిగించారు.

దీనిపై చార్మినార్ పోలీసులు ఈ-పెట్టి కేసులు (61 B CP ACT & 292 BNS ACT కింద) నమోదు చేశారు. గౌరవ మేజిస్ట్రేట్ శ్రీ ఎం. భాస్కర్ గారు 06-04-2026న ఈ కేసులను (STC No- 1837, 1838, 1839/2026) విచారించి, నేరం నిరూపితమైనందున నిందితులకు రెండు రోజుల జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

బహిరంగ ప్రదేశాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై మరియు పోలీసుల విధులను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా చార్మినార్ ఇన్‌స్పెక్టర్ టి. రాంబాబు హెచ్చరించారు.


Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >
Image 1

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య

Posted On 2026-07-14 11:38:49

Readmore >
Image 1

సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-07-14 11:17:33

Readmore >
Image 1

రూ. 2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ AE

Posted On 2026-07-14 09:33:44

Readmore >
Image 1

పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!

Posted On 2026-07-14 03:38:14

Readmore >