Posted on 2026-04-06 19:35:37
వార్డు మెంబర్లను బెదిరిస్తూ సర్పంచ్ నరేష్ ఇష్ట అనుసారంగా గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడు
దోమకొండ మండల్ నుంచి అంచనూర్ గ్రామం వార్డు మెంబర్లను బెదిరింపు కాల్స్ చేపిస్తున్న అంచనూర్ గ్రామ సర్పంచ్.
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: దోమకొండ మండల్ అంచనూర్ గ్రామంలో ఏపని చేసినా దానికి సంబంధించిన "బిల్లు" మొత్తం సామగ్రి కొనుగోలు చేసిన ఖాతాలో పంచాయతీ "ఖాతా" నుంచి విడుదల చేయాలి.కానీ ఇక్కడ అవేమీ పట్టించుకోకుండా కొందరు దారి మళ్లించారు. బంధు వులు,స్నేహితులు,ఇతర వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించి నిధులు డ్రా చేశారు.ఇంకొందరు ఖర్చు చేసిన మొత్తానికంటే ఎక్కువగా డ్రా చేసినట్లు తెలుస్తోంది.మరికొందరు ఆన్లైన్లో అప్లోడ్ చేసిన బిల్లులకు,డ్రా చేసిన వాటికి "మధ్య తేడా"ఉన్నట్లు తెలుస్తోంది.ఒక గ్రామానికి సంబంధించిన నోట్పైల్నే మరో గ్రామానికి వాడుకొని బిల్లులు తీసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.. అంచనూర్ గ్రామంలో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు తెలియకుండా ఇష్టం అనుసారంగా గ్రామపంచాయతీ బిల్స్ క్లెయిమ్స్ చేయడం జరుగుతుంది. కావున ఇప్పటినుంచైనా నోట్ ఫైల్ పైన మా యొక్క వార్డు మెంబర్స్ తీర్మానం చేసి ఇచ్చిన నోట్ ఫైల్ ని స్వీకరించగలరని మనవి చేయుచున్నాము లావాదేవీలు జరిగినవి స్పెషల్ గా ఆడిట్ చేయగలరని ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ కు రాతపూర్వకంగా అందజేశారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రశాంత్ గౌడ్, పెద్దగోని ,గంగవ్వ , నీరడి శేఖర్ జనగామ నవీన్, తెడ్డు స్వప్న, పడకంటి రవికుమార్, పద్మ, గోసాన్పల్లి నర్సింలు, మరియు దోర్నాల లక్ష్మణ్ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిరిగంటి నరేష్ తదిరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >