Posted on 2026-04-06 13:06:45
డైలీ భారత్, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ లో తీవ్ర భద్రతా లోపం జరిగింది. ఓ దుండగుడు తన కారుతో అసెంబ్లీ లోపలికి ప్రవేశించాడు. గేటును కారుతో ఢీకొట్టి అసెంబ్లీ ఆవరణలోకి వెళ్లాడు. గేటు నెంబర్ 2 వద్ద మధ్యాహ్నం రెండు గంటలకు ఈ ఘటన జరిగింది. కారుకు యూపీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్నది. ఆ కారులో వచ్చిన డ్రైవర్.. అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా ఆఫీసు దిశగా వెళ్లాడు. అక్కడ నుంచి వెనుదిరిగే ముందు అతను ఫ్లవర్ బొకే ఉంచినట్లు ఢిల్లీ సెక్రటేరియేట్ అధికారి తెలిపారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. భద్రతా వైఫల్యం జరిగినట్లు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సెక్యూర్టీ ఉల్లంఘన ఘటన కింద దీన్ని భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ప్రస్తుతం అక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది. ఫ్లవర్ బొకేలో ఎటువంటి పదార్ధం లేదని తేల్చారు.
కారును ట్రేస్ చేసే పనిలో ఢిల్లీ పోలీసులు
ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >