| Daily భారత్
Logo




జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

News

Posted on 2026-04-05 12:56:11

Share: Share


జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

దేశాభివృద్ధికి బాబు జగ్జీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయం: అదనపు ఎస్పీ కె. నరసింహారెడ్డి

డైలీ భారత్, కామారెడ్డి:  భారతదేశ మాజీ ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఆదివారం కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్)  కె. నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు జగ్జీవన్ రామ్ గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరంలో బాబు జగ్జీవన్ రామ్ పోషించిన పాత్ర విశిష్టమైందని కొనియాడారు. స్వాతంత్ర్యం అనంతరం వివిధ కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ దేశాభివృద్ధికి ఆయన విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. దళితుల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం ఆయన జీవితాంతం పోరాడారని వివరించారు.

సమాజంలో సమానత్వం, న్యాయం నెలకొల్పేందుకు ప్రతి ఒక్కరూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను ఆచరిస్తూ ముందుకు సాగాలని అధికారులకు, సిబ్బందికి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని బాబు జగ్జీవన్ రామ్ కి ఘన నివాళులు అర్పించారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >