Posted on 2026-04-05 09:47:28
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఇటీవల ప్రభుత్వ బియ్యాన్ని ఆటోలు తరలిస్తుండగా సివిల్ సప్లై ఆరని అడ్డుకున్న వ్యక్తులను రిమాండ్ కు తరలించడం జరిగినది. వివరాలలోకి వెళితే సుజాతనగర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు అనగా అజ్మీర లక్ష్మణ్, అజ్మీర రాజ్ కుమార్, బండి భాస్కర్ మరియు ఆదినారాయణ అను వ్యక్తులు కొమ్ముగూడెం గ్రామములోని లబ్ధిదారుల వద్ద నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని,తమ వద్ద ఉన్న ట్రాలీఆటోలో లోడ్ చేసుకుని కొత్తగూడెం వైపునకు వెళుతూ ఉండగా,నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు(R.I), కొమ్ముగూడెం గ్రామంలోని పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద ట్రాలీఆటోను ఆపి తనిఖీ చేయగా, సదరు వ్యక్తులు కోపోద్రిక్తులై సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు పై దాడి చేసిన ఘటన విధితమే, అయితే ప్రభుత్వ అధికారిపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించినందుకు గాను, కేసు నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు, సమగ్ర దర్యాప్తు మరియు విచారణను వేగవంతం చేసి, నిందితులను రిమాండ్ నిమిత్తము గౌరవ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి ఎదుట హాజరు పరచడం జరిగినది. ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన లేదా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన చట్టపరమైన చర్యలు తీసుకోని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాధావతు రవి తెలిపినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >