Posted on 2026-04-04 14:42:56
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఆటలపోటీలలో పాల్గొనడం వల్ల దేహదారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుందని,మరింత ఆరోగ్యవంతులవుతారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన గాయత్రి క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ-2026 ప్రారంభించారు.ఈ పోటీలను ప్రారంభించేందుకు విచ్చేసిన సందర్భంగా స్థానిక యువకులు బాణసంచా పేల్చి,డప్పు వాయిద్యాలతో ఎంపీ రవిచంద్ర తదితర ప్రముఖులకు ఘన స్వాగతం పలికారు.ఎంపీ రవిచంద్ర, బీఆర్ఎస్ నాయకులు దిండిగల రాజేందర్,వనమా రాఘవ,కాపు సీతామహాలక్ష్మీ,మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ తదితర ప్రముఖులు అమరవీరుల స్థూపానికి పూలుజల్లి నివాళులర్పించారు.ఎంపీ రవిచంద్ర టాస్ వేసి బ్యాటింగ్ చేసి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ప్రారంభించారు.ఈ పోటీల నిర్వాహకులు బీ.శ్రీనివాస్,కన్నిలు ఎంపీ రవిచంద్రకు క్రికెట్ టీం సభ్యులను పరిచయం చేశారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ, అంతర్జాతీయ క్రికెట్ లో మన భారత జట్టు అత్యుత్తమ ప్రతిభాపాటవాలు కనబర్చుతున్నదని కొనియాడారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని,ఈ రంగంలో కూడా గొప్పగా ఎదగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వివరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి,రంగనాథ్,బాదావత్ శాంతి నాయక్,కార్పోరేటర్స్ మల్హోత్రా సాగర్,కాలేరు సింధూ తపస్వి,బొమ్మిడి రమాకాంత్,బాదావత్ శ్రీకాంత్,నవతన్,బొమ్మిడి శ్రీకాంత్,అనుదీప్ తదితరులతో పాటు వందలాది మంది యువత పాల్గొన్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >