| Daily భారత్
Logo




రాజన్న సిరిసిల్ల జిల్లా... సురక్షిత సమాజంకోసం – సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి : ప్రభుత్వ విప్

News

Posted on 2026-04-04 08:08:38

Share: Share


రాజన్న సిరిసిల్ల జిల్లా... సురక్షిత సమాజంకోసం – సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలి : ప్రభుత్వ విప్

ఒక్క సీసీ కెమెరా 100 పోలీసులతో సమానం.

నేరాల నియంత్రణలో,కేసుల చేదనలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సమాజ భద్రత కోసం సీసీ కెమెరాల ఏర్పాటు అత్యంత అవసరమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని,ఒక్క సీసీ కెమెరా100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తుందని అన్నారు..

రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తో కలిసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు.

ఈసందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు వచ్చి 24 కెమెరాలు ఏర్పాటు చేసిన మార్గం గోపిని జిల్లా ఎస్పీ, ప్రభుత్వ విప్ అభినందించారు.

అనంతరం ప్రభుత్వ విప్ మాట్లాడుతూ....

గతంతో పోల్చితే ప్రస్తుతం పోలీసింగ్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు.ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోలీసు శాఖ నేరాల నియంత్రణలో ముందుకు సాగుతోందన్నారు.నేరాలను ముందుగానే నివారించడంతో పాటు,కేసుల చేదనలో కూడా సీసీ కెమెరాలు ఎంతో సహాయపడతాయన్నారు.ప్రజలు, వ్యాపారస్తులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 


ఈసందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ...

సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడమే కాకుండా, జరిగిన ఘటనలపై వేగంగా దర్యాప్తు చేయడంలో కూడా ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు.ప్రజల సహకారంతో ప్రతి గ్రామం, ప్రతి వీధిలో సీసీ కెమెరాల ఏర్పాటు జరిగితే సమాజం మరింత సురక్షితంగా మారుతుందని అన్నారు

మండల ప్రజల,ప్రయాణికుల సౌకర్యార్థం రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్ స్టాండ్‌ను  ప్రారంభించారు.ఈబస్ స్టాండ్ ప్రారంభంతో మండలంలోని ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయని,గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.

ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా ప్రయాణం చేసేందుకు పోలీస్ శాఖ సమర్థవంతమైన రక్షణా చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఈకార్యక్రమంలో డిఎస్పీ శ్రీనివాస్, సి.ఐ వెంకటేశ్వర్లు,తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్,ఎస్.ఐలు మోతిలాల్, రమేష్,సర్పంచ్ నారాయణ, ఉపసర్పంచ్ అభిలాష్,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >