Posted on 2026-04-04 07:32:56
డైలీ భారత్, హైదరాబాద్: వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓలు, అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు సరికొత్త Whatsapp Impersonation Fraud కు తెరలేపారు. సంస్థల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపడం ద్వారా కంప్యూటర్లలోకి మాల్వేర్‌ను ప్రవేశపెట్టి, తద్వారా సిస్టమ్స్‌పై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతున్నారు.
సిస్టమ్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత, అందులో యాక్టివ్‌గా ఉన్న వాట్సాప్ వెబ్ సెషన్లను ఉపయోగించి సీఈఓ లేదా సీఎఫ్ఓల పేరుతో అకౌంటెంట్లకు తప్పుదారి పట్టించే సందేశాలను పంపిస్తున్నారు.
తాను అత్యవసర సమావేశంలో ఉన్నానని, ఫోన్ ఎత్తడం వీలుపడదని నమ్మబలుకుతూ, సోషల్ ఇంజనీరింగ్ వ్యూహాలతో కోట్లాది రూపాయలను తక్షణమే సైబర్ నేరగాళ్లు తమ ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నారు.
వ్యాపార సంస్థల అధినేతలు, సీఈఓలు, సీఎఫ్ఓల ఫోన్ నంబర్ల నుంచే అకౌంటెంట్లను సందేశాలు వస్తుండటంతో నిజమేనని డబ్బును పంపుతున్నారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో, ప్రతి కంపెనీ కూడా అప్రమత్తంగా ఉండాలి.
వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదు. వెంటనే వారికి నేరుగా ఫోన్ చేసి ఆ మెసేజ్ నిజమేనా కాదా అని ధృవీకరించుకోవాలి.
ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసి ఉంచండి. అలాగే వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయడం మర్చిపోకండి.
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి. లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి.
#CyberCrimeAwareness #WhatsAppFraud #StaySafe #CyberSecurity
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >