Posted on 2026-04-03 08:41:35
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కొత్తగూడెం టౌన్‌లో సూపర్ బజార్ సమీపంలోని రావి చెట్టు కింద నివసిస్తున్న చర్మకారుల సంఘం పెద్దమనిషి సత్యాల వెంకన్న (రెడ్డి) కన్నుమూశారు. ఆయన మృతి స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
26వ డివిజన్‌కు చెందిన వెంకన్న చర్మకారుల సంఘంలో ప్రముఖ నాయకుడిగా, సామాజిక సేవలో ముందుండి పనిచేశారు. సంఘానికి చేసిన సేవలు గుర్తుండేలా ఉన్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో చేరుకుని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, నాయకులు కూసుపాటి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్ తదితరులు వెంకన్న మృతికి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
రిపోర్టర్ సాంబశివరావు, సారధి ఆధ్వర్యంలో చర్మకారుల సంఘం సభ్యులు కూడా వెంకన్న సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >