| Daily భారత్
Logo




పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)

News

Posted on 2026-04-03 08:40:29

Share: Share


పాల్వంచ లో ఘనంగా వీర హనుమాన్ విజయ యాత్ర(బజరంగ్దళ్ బైక్ ర్యాలీ)

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ ప్రఖండలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పాల్వంచ మండలం కేశవాపురం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం నుండి పాల్వంచ టౌన్, పాత పాల్వంచ మీదుగా నవభారత్ ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు 15 కిలోమీటర్ల మేర వీర హనుమాన్ విజయ యాత్ర బజరంగ్దళ్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది,  శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు చిలుకూరి నాగేశ్వరరావు కొబ్బరికాయ కొట్టితెలంగాణ రాష్ట్ర మందిర అర్చక పురోహిత్ సహ ప్రముఖ్ వోరుగంటి సురేష్ కుమార్ కాషాయ ధ్వజం ఊపి ఈ శోభాయాత్రను ప్రారంభించడం జరిగింది, అనంతరం ఈ బజరంగ్దళ్ బైక్ ర్యాలీ సి- కాలనీ గేట్, బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ నటరాజ్ సెంటర్, గట్టాయిగూడెం ఆంజనేయ స్వామి వారి ఆలయం, అల్లూరి సెంటర్, శాస్త్రి రోడ్డు, కూరగాయల మార్కెట్, దమ్మపేట సెంటర్, పాత పాల్వంచ ఆంజనేయ స్వామి వారి ఆలయం, రామానంద తీర్థ కాలనీ, సంజయ్ నగర్, నవభారత్ ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు నిర్వహించడం జరిగింది. బైక్ ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు జై శ్రీరామ్, భారత్ మాతాకీ జై, రామలక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఖమ్మం విభాగ్ సంఘటన మంత్రి గడిదేశి వెంకటేశ్వర్లు, జిల్లా సంఘటన మంత్రి గంగాధరి సీత, జిల్లా సహా కార్యదర్శి కొమ్ము నరేష్, జిల్లా బజరంగ్దళ్ సహా సంయోజక్ శ్రీరామోజు మధుసూదనా చారి, బిజెపి జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు రాపాక రమేష్, విశ్వహిందూ పరిషత్ పాల్వంచ ప్రఖండ కార్యదర్శి దాసరి మాధవరావు, పాల్వంచ ప్రఖండ సహ కార్యదర్శి భూక్య మోహన్, ప్రఖండ సహ కార్యదర్శి వేములపల్లి ప్రవీణ్, ప్రఖండ  బజరంగ్దళ్ సంయోజక్ రామగిరి ప్రసాద్, ప్రఖండ బజరంగ్దళ్ సహా సంయోజక్ ముదిగొండ కృష్ణమూర్తి, ప్రఖండ బజరంగ్దళ్ సహా సంయోజక్ నిమ్మల వరుణ్, ప్రఖండ బజరంగ్దళ్ గోరక్ష ప్రముఖ్ నూకల సతీష్ కుమార్, ప్రఖండ బజరంగ్దళ్ విద్యార్థి ప్రముఖ గడిదేశి సాయి భరత్, ప్రఖండ బజరంగ్దళ్ సాప్తాహిక్ మిలన్ యాదగిరి, ప్రఖండ మాతృశక్తి సంయోజిక మంద వెంకటరమణ, పట్టణ బజరంగ్ దళ్ సంయోజక్ పొదిల రామకృష్ణ, పట్టణ భజరంగ్దళ్ సహా సంయోజక్ ముదిగొండ నాగేశ్వరరావు, పూసల తండా బజరంగ్దళ్ సంయోజక్ ఆంగోత్ మోహన్, పూసల తండా బజరంగ్దళ్ సహ సంయోజక్ హథిరాం, మంచికంటి నగర్ మాతృశక్తి సంయోజక రమణమ్మ, పాత పాల్వంచ బజరంగ్దళ్ సంయోజక్ తాళ్లూరి వెంకట్, ఆర్ఎస్ఎస్ కళ్లెం వెంకట రెడ్డి, బిజెపి కార్యకర్త గడ్డం అజయ్ మరియు 100 మోటార్ బైకులు 200 మంది విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్, మాతృశక్తి, బిజెపి, హిందుత్వ, ధార్మిక వాదులు పాల్గొనడం జరిగింది.


Image 1

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి నిజామాబాద్ యువతి విరాళం

Posted On 2026-09-06 16:20:56

Readmore >
Image 1

దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

Posted On 2026-09-06 04:06:38

Readmore >
Image 1

రైస్ మిల్లర్లపై కక్షపూరిత దాడులెందుకు..?

Posted On 2026-09-06 04:04:29

Readmore >
Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >