Posted on 2026-04-03 06:36:21
డైలీ భారత్, రామంతాపూర్ / ఉప్పల్ :వెంకట సాయి నగర్ కాలనీలో కొంతకాలంగా ఇంటి వ్యర్థాలు, చెత్త రోడ్డుపై పడేయడం వల్ల రహదారులపై వాహనాలు జారిపడే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను కాలనీ ప్రజలు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ నేపథ్యంలో ఏ. విజయేందర్ రెడ్డి తన కమిటీ సభ్యులతో కలిసి సమస్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన శానిటేషన్ విభాగం సిబ్బంది రోడ్లను ఊడ్చి శుభ్రపరిచి, కాలనీ ప్రజలకు ఉపశమనం కలిగించారు.
ఈ సందర్భంగా స్పందించి పని చేసిన శానిటేషన్ డీఈ, ఏఈ, సూపర్వైజర్, జవాన్‌లు, శానిటేషన్ కార్మికులకు కాలనీ అధ్యక్షుడు ఏ. విజయేందర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా కాలనీ పరిశుభ్రతకు సహకరించిన అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు.
అలాగే కాలనీ ప్రజలు కూడా ఇంటి చెత్త, వ్యర్థాలను రోడ్లపై వేయకుండా పరిశుభ్రతను పాటించి కాలనీని శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >