| Daily భారత్
Logo




ఏఎస్పీ, కామారెడ్డి కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

News

Posted on 2026-04-01 15:21:20

Share: Share


ఏఎస్పీ, కామారెడ్డి  కార్యాలయంలో నూతన ఛాంబర్‌ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ

డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి ఏఎస్పీ కార్యాలయంలోని పాత ఛాంబర్‌ను ప్రజల సౌకర్యార్థం మరియు కార్యాలయ అవసరాలకు అనుగుణంగా అన్ని హంగులతో పునరుద్ధరించడం జరిగింది. ఆధునీకరించిన ఈ నూతన ఛాంబర్‌ను ఈరోజు జిల్లా ఎస్పీ యం రాజేష్ చంద్ర ఐపీఎస్ అధికారికంగా ప్రారంభించారు. కార్యాలయానికి వచ్చే ప్రజలు/భాదితులు  తమ సమస్యలను అధికారులకు విన్నవించుకోవడానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రశాంతమైన మరియు మెరుగైన వాతావరణం ఉండేలా ఈ మరమ్మత్తులు చేపట్టారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ....

పోలీస్ కార్యాలయాలు ప్రజలకు భరోసా ఇచ్చేలా ఉండాలని, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా అధికారుల పనితీరులో మరింత పారదర్శకత, వేగం పెరుగుతాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, ప్రజలకు చేరువగా ఉంటూ వారి ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని ఆయన వివరించారు. కార్యాలయ ఆధునీకరణ వల్ల అటు సిబ్బందికి, ఇటు ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహ రెడ్డి , కామారెడ్డి సబ్ డివిజన్ పరిధిలోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు (CIs), ఎస్‌ఐలు (SIs) మరియు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Image 1

నీవు వస్తావని ఆశా మామ…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-05 06:06:39

Readmore >
Image 1

ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త

Posted On 2026-09-04 17:43:14

Readmore >
Image 1

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Posted On 2026-09-04 14:29:48

Readmore >
Image 1

రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించాలి

Posted On 2026-09-04 14:28:48

Readmore >
Image 1

రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక

Posted On 2026-09-04 14:25:00

Readmore >
Image 1

100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు

Posted On 2026-09-04 12:11:03

Readmore >
Image 1

హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్

Posted On 2026-09-04 12:09:51

Readmore >
Image 1

ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు

Posted On 2026-09-04 08:53:55

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు

Posted On 2026-09-04 03:56:31

Readmore >
Image 1

ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!

Posted On 2026-09-03 09:31:35

Readmore >