Posted on 2026-03-30 18:39:53
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌతంపూర్‌కు చెందిన భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్‌ను బీఆర్‌ఎస్ కొత్తగూడెం మజీ మండల అధ్యక్షులు ఎండీ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, స్మారక చిహ్నాన్ని అందజేశారు.
సీఐ నరేష్ కుమార్ విధుల్లో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజలకు అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరించడంలో ఆయన చూపుతున్న చొరవను ప్రశంసించారు.
ఈ సందర్భంగా సీఐ నరేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల సహకారం ఉంటేనే శాంతి భద్రతలు మరింత బలోపేతం అవుతాయని తెలిపారు. సమాజంలో శాంతి, సామరస్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మజీ మండల అధ్యక్షుడు ఎండి హుస్సేన్, నాయకులు నజీర్,శ్యామ్, ఖాదర్, సతీష్, మోహన్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ ఆత్మీయ వాతావరణంలో సాగింది.
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >
ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో రచ్చ...అధికారిపై చర్యలు తీసుకోవాలంటున్న బూర బాలమల్లు
Posted On 2026-09-04 03:56:31
Readmore >
ఢిల్లీ షాకింగ్ ఘటన... యువతి పొట్టలోంచి 1.16 కిలోల వెంట్రుకల ముద్ద తొలగింపు!
Posted On 2026-09-03 09:31:35
Readmore >