Posted on 2026-03-18 14:18:12
డైలీ భారత్ హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ వేదికగా ఇటీవల ముగిసిన 2వ ఆల్ ఇండియా పోలీస్ కబడ్డీ క్లస్టర్ (2025-2026) క్రీడా పోటీల్లో తెలంగాణ పోలీస్ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రాష్ట్ర పోలీసుల కీర్తిని చాటారు. పతకాలతో తిరిగి వచ్చిన క్రీడాకారులను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి తన కార్యాలయంలో అభినందించారు.
ఈ పోటీల్లో పురుషుల ఖో-ఖో విభాగంలో తెలంగాణ జట్టు పట్టుదల ప్రదర్శించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. వివిధ విభాగాలకు చెందిన 15 మంది క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని చాటి ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఇన్ స్పెక్టర్లు బి. శ్రీనివాస్, ఎస్. మట్టం రాజు (సైబర్ క్రైమ్), ఆర్ఎస్ఐ ఎ. రమేష్, వనస్థలిపురం పీఎస్‌కు చెందిన పి. రంజిత్ కుమార్ కోచ్, కెప్టెన్లుగా వ్యవహరించగా, వివిధ టీజీఎస్పీ బెటాలియన్లకు చెందిన కానిస్టేబుళ్లు జట్టు గెలుపులో తమ వంతు సహకారాన్ని అందించారు.
అలాగే మహిళల ఫెన్సింగ్ విభాగంలో భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ షేక్ ఫౌజియా అసాధారణ ప్రదర్శన చేశారు. ఫైనల్ వరకు దూసుకెళ్లిన ఆమె, హోరాహోరీ పోరులో రజత పతకాన్ని సాధించి రాష్ట్ర పోలీస్ శాఖకు పేరు తెచ్చారు. ఆమెకు శిక్షణ ఇచ్చిన ఎన్.ఐ.ఎస్ ఫెన్సింగ్ కోచ్ ఎస్.ఆర్. అర్జున్ ఆనంద్ కృషిని కూడా డిజిపి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ ఐ జి పి డా. గజరావు భూపాల్, స్పోర్ట్స్ ఆఫీసర్ డా. ఆర్.వి. రామారావు తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >