Posted on 2026-03-18 07:05:38
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తండ్రి మృతి చెందిన బాధలో ఉన్న విధి ముందు నిలబడాల్సిన పరిస్థితి ఓ చిన్నారి జీవితంలో కనిపించింది. బిజెపి నాయకుడు చందుపట్ల రాజిరెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందగా అదే సమయంలో ఆయన చిన్న కుమారుడు అక్షిత్ రెడ్డి పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇవాళ హిందీ పరీక్ష ఉండడంతో… ఇంట్లో తండ్రి మృతి దుఃఖం, కుటుంబ సభ్యుల రోదనలు మధ్యే… కంటినిండా బాధతో పరీక్ష రాయడానికి బయలుదేరాడు అక్షిత్. ఈ విషయం తెలుసుకున్న అతను చదువుతున్న విద్యాసంస్థ వ్యవస్థాపకుడు లతీఫ్… కుటుంబ సభ్యులను ఓదార్చి, పరీక్ష రాయించడం అవసరమని నచ్చజెప్పి సెంటర్‌కు తీసుకెళ్లారు. పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో తన సోదరితో మాట్లాడుతూనే… కంటతడి పెట్టిన అక్షిత్ పరిస్థితి అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >