Posted on 2026-03-10 13:20:14
హైదరాబాద్ కేంద్రంగా మూడు బుల్లెట్ ట్రైన్ కారిడార్ల ప్రతిపాదన
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: శంషాబాద్ వద్ద హైస్పీడ్ రైల్ టెర్మినల్‌కు మెట్రో రైలు అనుసంధానం
విమానాశ్రయం, ఓఆర్ఆర్, మెట్రో, బుల్లెట్ రైలు ఒకేచోట కలిసేలా మెగా జంక్షన్
ప్రాజెక్టుపై క్షేత్రస్థాయి అధ్యయనానికి అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు
రాజధాని నగర రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రంగం సిద్ధమవుతోంది. నగర శివారులోని శంషాబాద్ కేంద్రంగా ఏర్పాటు కానున్న హైస్పీడ్ రైల్ (బుల్లెట్ ట్రైన్) నెట్‌వర్క్‌ను మెట్రో రైలుతో అనుసంధానించే బృహత్ ప్రణాళికపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మెగా ప్రాజెక్టుపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు విశ్వసనీయ సమాచారం.కేంద్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, పుణె నగరాలకు మూడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. గంటకు 300 నుంచి 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్ల కోసం శంషాబాద్ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న బహదూర్‌గూడ, రషీద్‌గూడ ప్రాంతాల్లో భారీ టెర్మినల్ నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన సుమారు 500 ఎకరాల భూమిని సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుముఖత చూపింది.మరోవైపు, మెట్రో రెండో దశలో భాగంగా నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కొత్త లైన్లు నిర్మిస్తున్నారు. ఈ మెట్రో మార్గాలను నేరుగా ప్రతిపాదిత హైస్పీడ్ రైల్ టెర్మినల్‌తో కలపాలని ప్రభుత్వం యోచిస్తోంది. తద్వారా శంషాబాద్ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, మెట్రో రైలు, బుల్లెట్ ట్రైన్ అనే నాలుగు ప్రధాన రవాణా వ్యవస్థలు ఒకేచోట కలిసేలా ఒక మెగా జంక్షన్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-09-09 08:34:54
Readmore >
నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం
Posted On 2026-09-08 18:02:08
Readmore >
కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం
Posted On 2026-09-07 16:41:28
Readmore >
దోమకొండ పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >