| Daily భారత్
Logo




ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

News

Posted on 2026-03-10 13:15:25

Share: Share


ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

విలేఖరుల సమావేశంలో ఉదండాపూర్ పరిహారం పెంపు జీవోను చూపుతున్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

సింగిల్ ఫ్యామిలీ పరిహారం రూ.6 నుంచి 18 లక్షలు పెంచాం

జాయింట్ ఫ్యామిలీ పరిహారం రూ.16 నుంచి 18 లక్షలు చేసాం

తేడాల్లేకుండా అందరికీ సమానమైన పరిహారం ఇస్తాం

2 నెలల్లోనే రూ.374 కోట్ల పరిహారం చెల్లిస్తాం

ప్లాట్లు కూడా ఉచితంగా  రిజిష్టర్ చేసి ఇప్పిస్తాం

ఇప్పుడు కూడా ప్రాజెక్టు పనులను  అడ్డుకుంటే ఊరుకోం

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టీకరణ


డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తాను హామీ ఇచ్చిన విధంగానే ఉదండాపూర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇచ్చే పరిహారాన్ని పెంచామని ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులను ఎవరైనా అడ్డుకుంటే తాను ఊరుకోనని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అవార్డు పాసైన తర్వాత పరిహారాన్ని పెంచిన దాఖలాలు ఎక్కడా లేవని కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రత్యేకంగా ఉదండాపూర్ నిర్వాసితులకే పరిహారాన్ని పెంచారని వివరించారు.

జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం క్రిక్కిరిసిన విలేఖరుల సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే తేడాను చూపించి, సింగిల్ ఫ్యామిలీకి రూ.6.5 లక్షలు, జాయింట్ ఫ్యామిలీకి రూ.16 లక్షలు పరిహారంగా నిర్ణయించారని చెప్పారు. మల్లన్నసాగర్ నిర్వాసితుల విషయంలో ఇలాంటి తేడాలు చూపించలేదన్నారు. అయితే ప్రస్తుతం తమ ప్రభుత్వం సింగిల్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అనే తేడా లేకుండా అందరికీ ఒకే పరిహారంగా రూ.18 లక్షలు ప్రకటించిందని తెలిపారు. దీంతో నిర్వాసితులకు రూ. 2 నుంచి రూ.12 లక్షల దాకా అదనపు పరిహారం లభిస్తుందన్నారు. ఇదివరకే పరిహారం మొత్తాలను అందుకున్న వల్లూరు, వల్లూరు తాండాలకు కూడా పెంచిన అదనపు పరిహారాన్ని ప్రభుత్వం అందించనుందని  చెప్పారు. పెంచిన పరిహారం కోసం అదనంగా రూ.146 కోట్లతో కలిపి మొత్తం రూ.374 కోట్ల మొత్తాన్ని రెండు నెలల్లోపుగా నిర్వాసితులకు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హామీ ఇచ్చారని గుర్తు చేసారు. అదనపు పరిహారం కోసం విడుదల చేసిన జీవో నెంబర్.1 కేవలం ఉదండాపూర్ నిర్వాసితులకు మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసిందని వెల్లడించారు. ఉదండాపూర్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పెంపు సమస్య పరిష్కారమైన నేపథ్యంలో ఉదండాపూర్ ప్రాజుక్టు పనులు సాఫీగా కొనసాగించడానికి అందరూ సహకరించాలని కోరారు. ఇప్పుడు కూడా ఎవరైనా చిల్లర రాజకీయాలు చేసి  ప్రాజెక్టు పనులను అడ్డుకోడం జరిగితే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగిస్తే గడువు లోపుగా రిజర్వాయర్ పనులు పూర్తి చేయలేమన్నారు. అలాగే  నిర్వాసితులకు ఇచ్చే ప్లాట్లను కూడా రిజిష్టర్ చేసి ఇవ్వాలని తాను మంత్రి ఉత్తమ్ ను కోరారని, ఆయన కూడా దీనికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన తరహాలోనే ఉదండాపూర్ నిర్వాసితులకు కూడా ప్లాట్లను ప్రభుత్వమే ఉచితంగా రిజిష్టర్ చేసి ఇచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. 

Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >
Image 1

నకిలీ హిజ్రా మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం

Posted On 2026-09-07 04:33:05

Readmore >