| Daily భారత్
Logo




ప్రతి నెల 100 కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నకామారెడ్డి జిల్లా పోలీసులు

News

Posted on 2026-03-10 12:58:00

Share: Share


ప్రతి నెల 100 కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తున్నకామారెడ్డి జిల్లా పోలీసులు

ఈ సంవత్సరం రూ. 40 లక్షలు  విలువైన 250  ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందించాము.

ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4531 మొబైల్ ఫోన్లను గుర్తించి, రూ. 7.25 కోట్ల విలువైన ఫోన్లు బాధితులకు అప్పగించిన కామారెడ్డి పోలీసులు.

స్పెషల్ డ్రైవ్ ద్వారా 123 (మొత్తం విలువ సుమారు ₹20 లక్షలు) పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ.

మొబైల్ కేంద్రంగా సైబర్ మోసాలు జరుగుతున్నాయి, ఫోన్ వినియోగించడంలో జాగ్రత్తలు పాటించాలి.

మీ ఫోన్ పోయిందా? ఆందోళన వద్దు.. CEIR పోర్టల్‌తో తిరిగి పొందండి.

బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి పోగొట్టుకున్న మొబైల్ పొందవచ్చు.

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్

డైలీ భారత్, కామారెడ్డి: సెల్ ఫోన్ పోయినా లేదా చోరీకి గురైనా ఆందోళన అవసరం లేదని, CEIR పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ తెలిపారు.

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది కేవలం సమాచార సాధనం మాత్రమే కాకుండా, అందులో బ్యాంకింగ్ వివరాలు, వ్యక్తిగత ఫోటోలు మరియు కీలకమైన డేటా కూడా ఉంటాయని ఎస్పీ తెలిపారు. ఫోన్ పోగొట్టుకోవడం వల్ల వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నందున జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తోందన్నారు.

ఈ నేపథ్యంలో ఇన్‌స్పెక్టర్ జె. నరేష్ పర్యవేక్షణలో RSI శ్రీ బాలరాజు మరియు ఐదుగురు కానిస్టేబుళ్లతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ బృందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి నెల సగటున 100కు పైగా మొబైల్ ఫోన్లను రికవరీ చేస్తూ బాధితుల్లో నమ్మకాన్ని పెంపొందిస్తోందన్నారు.

గణాంకాలను వెల్లడిస్తూ, గత ఏడాదిలోనే సుమారు ₹3 కోట్ల విలువైన 1,834 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. ఇటీవల నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా గత 30 రోజుల్లో ₹20.32 లక్షల విలువైన 123 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు.

అలాగే CEIR పోర్టల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కామారెడ్డి జిల్లాలో మొత్తం 4,531 మొబైల్ ఫోన్లను గుర్తించి, సుమారు ₹7.25 కోట్ల విలువైన మొబైల్ ఫోన్లను బాధితులకు తిరిగి అప్పగించడం జరిగిందని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా మొబైల్ రికవరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రత్యేక బృందాన్ని అభినందించారు.

చివరగా, మొబైల్ ఫోన్ పోయిన వెంటనే ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు, సిమ్ కార్డును బ్లాక్ చేసి www.ceir.gov.in వెబ్‌సైట్‌లో ఫోన్ IMEI నంబర్‌ను బ్లాక్ చేయాలని కోరారు. మొబైల్ ద్వారానే సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున గుర్తుతెలియని లింకులు మరియు కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

రికవరీ అయిన మొబైల్ ఫోన్లను పొందేందుకు బాధితులు తమ వద్ద ఉన్న ధృవపత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలో RSI బాలరాజు (ఫోన్: 8712686114) ని సంప్రదించి తమ మొబైల్ ఫోన్లను పొందవచ్చని తెలిపారు.

Image 1

వాటర్ బాటిలు అధిక ధర.. రూ.7 లక్షలు ఫైన్!

Posted On 2026-09-09 17:17:04

Readmore >
Image 1

కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్

Posted On 2026-09-09 14:45:53

Readmore >
Image 1

స్పీకర్ కు బీఆర్ఎస్ బహిరంగ క్షమాపణ చెప్పాలి

Posted On 2026-09-09 14:29:32

Readmore >
Image 1

దేమేకలాన్ పాఠశాలలో ఘనంగా కలోజి నారాయణరావు జయంతి వేడుకలు

Posted On 2026-09-09 14:28:15

Readmore >
Image 1

జర్నలిస్టుల సంక్షేమానికి కృషి

Posted On 2026-09-09 08:35:55

Readmore >
Image 1

తెలుగు సాహిత్యానికి ప్రజాకవి కాళోజీ సేవలు చిరస్మరణీయం... ఎస్పీ మహేష్ బి.గితే

Posted On 2026-09-09 08:34:54

Readmore >
Image 1

నామకరణ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర డైరెక్టర్ ఆర్.టి.ఐ చట్టం... ఎంఎ సలీం

Posted On 2026-09-08 18:02:08

Readmore >
Image 1

వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రావణమాసం కుంకుమ పూజలు

Posted On 2026-09-08 18:01:01

Readmore >
Image 1

బాబు… అని పిలవాలని ఉన్నది…మంజుల పత్తిపాటి

Posted On 2026-09-08 08:44:38

Readmore >
Image 1

కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్శసన పాలనలో నేటి రోజు మహిళలోకానికి దుర్దినం

Posted On 2026-09-07 16:41:28

Readmore >