| Daily భారత్
Logo




ఉపాధ్యాయుల మనోస్థైర్యం దెబ్బతినేలా ఆకునూరి మురళి నివేదిక

News

Posted on 2026-02-28 03:34:58

Share: Share


ఉపాధ్యాయుల మనోస్థైర్యం దెబ్బతినేలా ఆకునూరి మురళి నివేదిక

ఖండించిన టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం

డైలీ భారత్, కామారెడ్డి: తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నిన్న సమర్పించిన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ నివేదికలో కొన్ని సానుకూల అంశాలున్నప్పటికీ, స్థూలంగా చూసినట్లయితే విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించే విధంగా ఉన్నదని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం తీవ్రంగా ఖండించారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహింపబడుతున్నటువంటి విద్యాసంస్థలను బలోపేతం చేసి మౌలిక సౌకర్యాలు కల్పించి, సరిపడా ఉపాధ్యాయులను నియమించాల్సి ఉండగా, మరొక కొత్త విధానాన్ని తీసుకొని తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పేరుతో మండలానికి రెండు మూడు పాఠశాలను 1500 మంది విద్యార్థులతో నెలకొల్పాలని ఆ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందించాలని, అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని సంవత్సరానికి 100 పాఠశాలలు నిర్మించుకుంటూ పోతే ప్రస్తుతం ఉన్న సాధారణ పాఠశాలలు ఏమి కావాలి  అదే సమయంలో ఆ పాఠశాలకు ఉపాధ్యాయులను ఎలా రిక్రూట్ చేస్తారో చెప్పలేదు.

తండాలు మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేసే దిశగా ఆయన సిఫార్సులు ఉన్నాయి. దీనివల్ల పేద బడుగు బలహీన వర్గాలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఉపాధ్యాయులపై తనకున్న అక్కస్ను రిపోర్టులో వెళ్ళగక్కారు ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువగా ఉన్నాయని వీటిని హేతుబద్దీకరించాలని ఆయన అనడం పూర్తిగా హాస్యాస్పదం వేతనాలు ఏ విధంగా నిర్ణయిస్తారు వేతన సంవత్సర ద్వారా శాస్త్రీయంగా అనేక కొలమానాలను పరిశీలించి, ద్రవ్యోల్బణం, వినియోగదారుల సూచి, మొదలగు అంశాల ద్వారా  హేతుబద్ధంగా సిఫార్సు చేస్తారు.

ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు నాలుగు పిఆర్సీలు ఉద్యోగ ఉపాధ్యాయులు నష్టపోయారు ఇదంతా పక్కకు పెట్టి కేవలం ఉపాధ్యాయులనే వేతనాలు ఎక్కువగా ఉన్నాయని చూపించి సమాజం దృష్టిలో ఉపాధ్యాయులను పలుచన చేయడం తప్ప మరొకటి కాదు అని చెప్పి భావిస్తున్నాం.

ఇక ఉపాధ్యాయుల పదోన్నతుల విషయమై ఇప్పటికే ఒక ఎస్జీటీ ఉపాధ్యాయుడు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ పొందడానికి 20 30 సంవత్సరాలు వేచి చూడాల్సిన పరిస్థితి అయినప్పటికీ తన మొత్తం సర్వీసులో ఒక ప్రమోషన్ కూడా పొందకుండా పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు ఎందరో ఉమ్మడి సర్వీస్ రూల్స్ పరిష్కారం కాకపోవడం మూలాన పర్యవేక్షక పోస్టులన్నీ ఇన్చార్జిలమయం అయిపోయి పదోన్నతులు పొందలేని పరిస్థితి నెలకొని ఉన్నది. ఇవన్నీ పట్టించుకోకుండా ఏకపక్షంగా సిఫార్సులు చేయడం ఆకునూరి మురళి సంకుచిత స్వభావానికి నిదర్శనం కనిపిస్తున్నది.

ఆకునూరి మురళి సిఫార్సులను వ్యతిరేకిస్తూ కలిసిచ్చే సంఘాలను కలుపుకొని ఈ సిఫార్సులకు వ్యతిరేకంగా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉన్నదని టి పి టి ఎఫ్ కామారెడ్డి  జిల్లా శాఖ భావిస్తుంది..

Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >
Image 1

నేతన్న నెత్తుటి నూలు...మంజుల పత్తిపాటి

Posted On 2026-08-07 06:40:06

Readmore >
Image 1

తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లిలో కల్తీ కల్లు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Posted On 2026-08-06 18:26:12

Readmore >
Image 1

పెద్ద చెరువును పరిశీలించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-08-05 17:08:38

Readmore >
Image 1

పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ

Posted On 2026-08-05 17:07:25

Readmore >
Image 1

ఒక్క నంబర్‌తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్

Posted On 2026-08-05 14:58:50

Readmore >
Image 1

దుబాయ్‌లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?

Posted On 2026-08-05 13:28:01

Readmore >
Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >