Posted on 2026-02-24 12:41:45
డైలీ భారత్, సిద్దిపేట: 4వ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడలు మరియు స్పోర్ట్స్ మీట్ - 2026లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిద్దిపేట జిల్లా పోలీస్ అధికారులను , సిబ్బందిని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ క్రీడల్లో సిద్దిపేట పోలీస్ యూనిట్ నుండి మొత్తం 09 మంది పోలీస్ సిబ్బంది వివిధ విభాగాల్లో పోటీపడి, తమ ప్రతిభతో జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చారు. మొత్తం 12 పతకాలను సాధించి సిద్దిపేట పోలీస్ శాఖ సత్తాను రాష్ట్ర స్థాయిలో చాటారు.
పతకాల వివరాలు:
బంగారు పతకాలు : 03
1. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ రోహిత్ , 2. సబ్ ఇన్స్పెక్టర్ అంజయ్య , 3. కానిస్టేబుల్ డి. రాజు.
వెండి పతకాలు : 02
1. డి లక్ష్మణ్ , 2. జె. రాజు.
కాంస్య పతకాలు : 07
మొత్తం పతకాలు: 12
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ గారు మాట్లాడుతూ, విధి నిర్వహణలో ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ, క్రీడల పట్ల మక్కువతో కష్టపడి సాధన చేసి పతకాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా, మానసిక ఉల్లాసానికి మరియు క్రమశిక్షణకు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాబోయే రోజుల్లో పోలీస్ శాఖ పరంగా పూర్తి సహకారం ఉంటుందని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, అదనపు డీసీపీ ఎ ఆర్ సుభాష్ చంద్రబోస్ , ఇన్స్పెక్టర్లు కిరణ్ , శ్రీధర్ గౌడ్ పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.
#Telangana State Police
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >