Posted on 2026-02-24 12:31:08
డైలీ భారత్, వరంగల్: రోడ్డు నిబంధనలు పాటించకుండపోవడంతో ఎంతో మంది దేశ భవిష్యతైన యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలియజేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే “ అరైవ్ అలైవ్ ” రెండవ విడత కార్యక్రమములో భాగంగా వరంగల్ ట్రాఫిక్ ఆధ్వర్యంలో హన్మకొండలోని వాగ్డేవి కళాశాల విధ్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తూ “అరైవ్ అలైవ్” ఏర్పాటు చేశారు. ముందుగా ఈ కార్యక్రమములో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విధ్యార్థులకు ప్రతి వాహనదారుడు పాటించాల్సిన ట్రాఫిక్ నిబందనలు, వాటిని అతి క్రమిస్తే జరిగే పరిణాలపై ట్రాఫిక్ అధికారులు విద్యార్థులకు వివరించారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గోన్న వరంగల్ పోలీస్ కమిషనర్ విధ్యార్థులను ఉద్యేశిస్తూ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తగు జాగ్రత్తలను తీసుకుంటూ వాహనం నడపాలని, ఇదే వాహనదారుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వాహనదారుడిపై వుందని వాహనదారుడు నిబంధనలు పాటించకుండా వాహనాలు నడపటం ద్వారా ప్రమాదాలకు గురైయ్యే అవకాశాలు ఎక్కువని, తన థ్రిల్ కోసం వాహనదారుడు వాహనం నడపటం చాలా ప్రమాదకమని, కొన్ని సందర్బాల్లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందని ఇలాంటి చర్యల కారణంగా కుటుంబ సభ్యులు ఎంతో నష్టాపోతారని, కావున ప్రతి వాహనదారుడు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ డిఫెన్సీ డ్రైవింగ్ చేయాలని సిపి విద్యార్థులకు సూచించారు. గత సంవత్సరంలో హత్యలు లేదా ఇతర కారణాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏనిమిది వందల మంది మరణించారు. కాని రోడ్డు ప్రమాదాల కారణంగా గతే ఏడాది 7,500 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడటం చాలా బాధకరమని, ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపాల్సిందిగా తెలియజేయాలని పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు.
అనంతరం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామంటూ విద్యార్థుల చేత ట్రాఫిక్ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమములో సెంట్రల్ డిసిపి దార కవిత, ట్రాఫిక్ అదనపు డిసిపి ప్రభాకర్ రావు, ఏసిపి సత్యనారయణ, ఇన్స్‌స్పెక్టర్లు వెంకన్న,సీతరెడ్డి,సుజాత, వాగ్దేవి కళాశాల ప్రిన్స్‌పాల్ శేషాచలం, కరస్పాడెంట్ శ్రవణ్ రెడ్డి హరిచంద్ర రెడ్డి పాల్గొన్నారు.
"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం
Posted On 2026-07-14 13:21:15
Readmore >
ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్
Posted On 2026-07-14 12:02:32
Readmore >
సిరిసిల్ల : పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా భాష బోధించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-07-14 11:17:33
Readmore >
పల్లెటూరి ప్రజలకు ముఖ్య సమాచారం.. పాము కాటుకు ఇక పై 108 లోను ఇంజక్షన్లు!
Posted On 2026-07-14 03:38:14
Readmore >
కల్లు తాగించి వృద్ధ మహిళల ఆభరణాలు అపహరించిన దొంగ అరెస్ట్, రిమాండ్
Posted On 2026-07-13 18:16:26
Readmore >