డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ సుందరయ్య నగర్ సిక్కువాడ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన చందన్ సింగ్-జక్తీ కూతురు రాజేశ్వరి వివాహం సందర్భంగా ఈ రోజు 36 వ వార్డు కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు 50 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బైరి శేఖర్,గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య,లింగంపెల్లి దేవయ్య, కుల్ల శ్రీనివాస్,కోడూరి మల్లేశం,బింగి శ్రీధర్,బొల్లి అంబదాస్, వెంకటస్వామి గౌడ్ మరియు వధువు బంధువులు పాల్గొన్నారు.