| Daily భారత్
Logo




పురమిత్ర పిర్యాదులు వెంటనే పరిష్కరించండి : కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్

News

Posted on 2026-02-21 03:26:40

Share: Share


పురమిత్ర పిర్యాదులు వెంటనే పరిష్కరించండి :  కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్

డైలీ భారత్, తిరుపతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుండి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్,అధికారులను ఆదేశించారు. 

పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన పిర్యాదులను శుక్రవారం సాయంత్రం ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, ఆరోగ్య శాఖ అధికారులతో కలసి ప్రకాశం పార్క్, శివశక్తి కళ్యాణ మండపం, తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలిపేందుకు మునిసిపల్ శాఖ పురమిత్ర యాప్ ను ప్రవేశపెట్టిందని అన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజల నుండి వచ్చిన సమస్యలను, పిర్యాదులను ఆయా విభాగాల అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని తెలిపారు  ముఖ్యంగా చెత్తకుప్పలు, డ్రైనేజీ కాలువల మరమ్మతులు, రోడ్లపై గుంతలు, అనధికారిక భవన నిర్మాణాలు వంటి పిర్యాదులు ఎక్కువ వస్తున్నాయని తెలిపారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. స్వర్ణ వార్డులో కార్యదర్సుల హాజరు నమోదు, రికార్డులను పరిశీలించారు. కార్యదర్సులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలిపారు. పురమిత్ర యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. 

కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ. మధు, శిల్ప, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.


#MCT #PuraMithra #Tirupati #maud_municipal #cdma_municipal #smartcity #sanitation #NCBN #APCM

Image 1

సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు

Posted On 2026-07-15 15:28:33

Readmore >
Image 1

తెలంగాణలో సర్‌ ప్రక్రియ ఆగస్టు 3 వరకు గడువు పొడిగింపు

Posted On 2026-07-15 14:31:22

Readmore >
Image 1

హైదరాబాద్ - మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో దారుణ హత్య

Posted On 2026-07-15 14:29:59

Readmore >
Image 1

ఐఏఎస్‌గా చెప్పుకొని పెళ్లి.. నెల రోజులకే భార్య ట్విస్ట్

Posted On 2026-07-15 14:28:56

Readmore >
Image 1

"100 మంది అడ్డొచ్చినా CM నే అరెస్ట్ చేసిన లేడీ సింఘం"

Posted On 2026-07-15 06:40:45

Readmore >
Image 1

కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-15 06:37:33

Readmore >
Image 1

శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు

Posted On 2026-07-15 05:39:50

Readmore >
Image 1

టింబర్ మర్చంట్స్ సంఘ అధ్యక్షున్ని సన్మానించిన షబ్బీర్

Posted On 2026-07-14 13:24:05

Readmore >
Image 1

"చేతులు కట్టొద్దు.. కాళ్లు పట్టుకోవద్దు" : తహసిల్దార్ నిర్ణయానికి ప్రజల హర్షం

Posted On 2026-07-14 13:21:15

Readmore >
Image 1

ఖమ్మం జిల్లా: ముగ్గురు అక్రమ గంజాయి రవాణా, సరఫరాదారుల అరెస్ట్

Posted On 2026-07-14 12:02:32

Readmore >