Posted on 2026-02-16 14:18:02
డైలీ భారత్, హుజూర్ నగర్: కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడిగా గెల్లి రవి ఎన్నిక కావడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన నాయకత్వంలో పట్టణ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని నాయకులు మరియు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ నూతన అధ్యక్షుడు గెల్లి రవి మాట్లాడుతూ... ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం వంటి అంశాలను ప్రధాన లక్ష్యాలుగా తీసుకొని పనిచేస్తామని తెలిపారు. పార్టీ కార్యకర్తలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీని పట్టణంలో మరింత బలపరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.పార్టీ కార్యకర్తలంతా ఐక్యంగా పనిచేస్తే పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని, భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించేలా కృషి చేస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శక రాజకీయాలు చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు గెల్లి రవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాయకత్వంలో పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >