రక్తదాతలను అభినందించిన కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ నాగరాణి...
ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా బిబిపేట్ మండల కేంద్రంలో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్ మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కామారెడ్డి రక్తదాతల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కామారెడ్డి జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్,జిల్లా న్యాయ సేవాధికారిత సంస్థ కార్యదర్శి పి నాగరాణి మరియు ఐవిఎఫ్ జాతీయ సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త లు మాట్లాడుతూ చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మెగా రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులను అభినందించి రక్తదానం చేసిన రక్తదాతలకు ప్రశంస పత్రాలను అందజేయడం జరిగింది.రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో రక్తదాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు.రక్తదాతలను ప్రోత్సహించడం కోసం వాటర్ బాటిల్ లు,ప్రశంస పత్రాలను అందజేసిన శ్రీ మణికంఠ భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు బా శెట్టి నాగేశ్వర్ ను అభినందించి సన్మానించడం జరిగింది. వాసవి క్లబ్,కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్) కమిటీలను అభినందించి సన్మానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు,గ్రామ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయి, వాసవి క్లబ్ అధ్యక్షుడు మురికి శ్రీనివాస్,ప్రధాన కార్యదర్శి,కోశాధికారి రెడ్ శెట్టి శ్రీనివాస్,జోన్ చైర్మన్ నాగ భూషణం,వైస్ గవర్నర్ బాశెట్టి నాగేశ్వర్,ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పబ్బ యాదగిరి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అమ్మద్,ప్రధాన కార్యదర్శి డాక్టర్ పుట్ల అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు పర్ష వెంకటరమణ,జాలిగామ శ్రీకాంత్,లీడర్ టీవీ సీఈవో బట్టుపల్లి నరేష్ గౌడ్,ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్,ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి కస్వ వెంకన్న,నంగునూరి కాశీనాథం,మందుల రామచంద్రం,పప్పుల ఆంజనేయులు మొదలగువారు పాల్గొనడం జరిగింది.