Posted on 2026-02-10 18:53:27
ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి : ఎస్పీ రోహిత్ రాజు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్,ఇల్లందు ,అశ్వారావుపేట మున్సిపాలిటీలకు బుధవారం జరగనున్న పోలింగ్ నేపథ్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.ఇందులో భాగంగా పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాల నందు ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు.అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 1200 మందితో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.పోలింగ్ కేంద్రాల పరిసరాలలో నిరంతర నిఘా కొరకు ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు.ఓట్ల లెక్కింపు కేంద్రమైన పాల్వంచ అనుబోస్ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్స్ స్క్వాడ్,బాంబుస్క్వాడ్ తో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు.ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >