Posted on 2026-02-10 14:32:27
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ బేసిక్ లైఫ్ సపోర్ట్ నుంచి పలు పరికరాలతో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ గా తీర్చిదిద్దగా.. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం పరిశీలించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆ వాహనంలోని ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ విత్ డీఫిబ్రీలేటర్, మానిటర్ తదితర అత్యవసర సమయంలో ఉపయోగించే పరికరాల పనితీరును ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అత్యవసర సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి తొందరగా చేరుకోని క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రులకు చేర్చాలని సిబ్బంది కి తెలియజేశారు. అనంతరం వాహనంలోని రికార్డులను పరిశీలించి ఇబ్బంది యెక్క పనితీరును ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భూమా నాగేందర్, సిరిసిల్ల జిల్లా మేనేజర్ అరుణ్ కుమార్, సిబ్బంది పెద్ది శ్రీనివాస్, వడ్నాల అనిల్ కుమార్, పోచంపల్లి పర్శరాములు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >