Posted on 2026-02-09 12:11:12
మోదీ నాయకత్వమే లక్ష్యంగా ముందుకు
డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని 38వ వార్డులో ఎన్నికల సందడి నెలకొంది. ఈ వార్డు నుండి భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోరా శైలజ శ్రీహరి ,ఈరోజు తన మద్దతుదారులతో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు.
కార్యకర్తలు, మద్దతుదారులతో కలిసి వార్డులోని ప్రతి గల్లీలో తిరుగుతూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు.
"బీజేపీని గెలిపిద్దాం - 38వ వార్డును ప్రగతి పథంలో నడిపిద్దాం" అనే నినాదాలతో ప్రచార ప్రాంగణం మార్మోగింది.
ప్రచారంలో భాగంగా వార్డులోని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్న శైలజ శ్రీహరి, తమను గెలిపిస్తే వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
డప్పు చప్పుళ్లు, పార్టీ జెండాలతో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, ఒక సేవకురాలిగా మీ ముందుకు వస్తున్నానని, కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఈ సందర్భంగా కోరారు.
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >
దడ పుట్టిస్తున్న థార్ దొంగలు... ఏపీ కి వచ్చిన ఘరానా దొంగలు...
Posted On 2026-06-19 11:14:35
Readmore >
"సిరిసిల్ల లో" టిఆర్ఎస్ "జండా పండగ... కొన్ని ఆసక్తికర పరిణామాలు
Posted On 2026-06-19 08:33:46
Readmore >