Posted on 2026-02-01 18:39:49
డైలీ భారత్, ఇందూరు: చిట్ ఫండ్స్ సంస్థలలో ప్రముఖ మరియు నమ్మకమైన సంస్థ శ్రీరామ్ చిట్ ఫండ్స్ అని, అదే సంస్థ వారు సామాజిక దృక్పథంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతి కింద రాష్ట్రస్థాయి నుండి మండల స్థాయి వరకు నగదు ప్రోత్సాహం అందివ్వడం చాలా అభినందనీయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డిఎస్ఎన్ కార్యాలయంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ‘మిషన్ 10th క్లాస్’ బ్రోచర్ ను ఆవిష్కరించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "మిషన్ 10th క్లాస్" లో భాగంగా 10వ తరగతి లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ మార్కులు సాధించిన వారికి 2.2 కోట్ల నగదు బహుమతిని అందివ్వడానికి ముందుకు రావడం సంతోషకరమైన విషయం అన్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 2026 మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారీ నగదు బహుమతులను అందించనున్నట్లు ఈ సందర్భంగా నిర్వాహకులు తమకు తెలిపినట్లు ఆయన వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయిలో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.5 లక్షల నగదు బహుమతి, రెండో స్థానంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ. 3 లక్షల నగదు బహుమతితో పాటు
జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ. 2 లక్షల నగదు బహుమతి అలాగే ఒక్కో నియోజకవర్గంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు లక్ష రూపాయల చొప్పున నగదు బహుమతి మరియు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ. 10 వేల నగదు బహుమతులను ఇన్సూరెన్స్ కంపెనీ వారు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పథకం ప్రభుత్వ పాఠశాలలో చదివే ఆణిముత్యాలు లాంటి విద్యార్థులకు ఒక చక్కటి వరమని, ప్రభుత్వ పాఠశాలలు అని నిరాశతో ఉన్నవారికి చక్కని అవకాశమని కావున ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ తల్లిదండ్రులు కళలను నెరవేర్చాలని పేర్కొన్నారు. ఇలాంటి పథకాలు విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి వారి లక్ష్య సాధనకు తోడ్పడతాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ డి.జి.ఎం. రాము, సీనియర్ డి.ఎం. తానాజీ, బ్రాంచ్ మేనేజర్ ఎ. కిషోర్, డెవలప్‌మెంట్ ఆఫీసర్లు సి.హెచ్. రాజు, పి. రాజేందర్, ఎ. సుదర్శన్, పి. వాసుగౌడ్, ఎస్. చంద్రశేఖర్, ఎం. సత్యనారాయణ, గణేష్, బాలరాజు, సంపత్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >