| Daily భారత్
Logo




సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అనుకూలమైన కేంద్ర బడ్జెట్

News

Posted on 2026-02-01 14:10:49

Share: Share


సామాన్య, మధ్య తరగతి ప్రజలకు అనుకూలమైన కేంద్ర బడ్జెట్

ఈ బడ్జెట్ వల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుంది

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని, ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  పేర్కొన్నారు. రైతులకు, అలాగే రోజువారి పనులు చేసుకునే వారికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగదాయకమని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తో దేశం మరికొన్ని రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అన్ని దేశాలకు మార్గదర్శకంగా నిలిచి ప్రపంచ దేశాల సరసన నిలబడడం ఖాయమన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడుకి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉపయోగం చేకూరుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  సూచనలతో ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ను రూపొందించారని ఆయన కొనియాడారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న కల్పితాలను ప్రజలు నమ్మకూడదని ఈ బడ్జెట్ కేవలం దేశాభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు.

Image 1

వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!

Posted On 2026-08-09 12:53:35

Readmore >
Image 1

ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!

Posted On 2026-08-09 08:27:49

Readmore >
Image 1

ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!

Posted On 2026-08-09 08:09:49

Readmore >
Image 1

కామారెడ్డి : విద్యుత్ నగర్ లో భారీ చోరీ

Posted On 2026-08-09 06:28:48

Readmore >
Image 1

పాక్ "హనీట్రాప్" లో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్..

Posted On 2026-08-08 19:48:51

Readmore >
Image 1

అంతర్‌జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్‌లు స్వాధీనం

Posted On 2026-08-08 17:43:12

Readmore >
Image 1

ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!

Posted On 2026-08-08 17:41:12

Readmore >
Image 1

నూతన సొసైటీ చైర్మన్ చిందల శ్రీనివాస్ రెడ్డి కి సన్మానం

Posted On 2026-08-08 17:15:23

Readmore >
Image 1

ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి

Posted On 2026-08-08 17:13:56

Readmore >
Image 1

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

Posted On 2026-08-08 16:04:38

Readmore >