| Daily భారత్
ADVERTISEMENT
Home / News / News

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

విద్యావంతుడు ఎమ్మెల్యే అయినా నియోజకవర్గంలో విద్య శూన్యం..?

విద్యార్థులు 1వ తరగతి నుంచి పై తరగతులు వేలుతున్న కూడా అ,ఆ లు తేల్వని పరస్థితి

MLA చదువు ఆయనకే ఉపయోగపడినది తప్ప పిల్లలకు ఎలాంటి ఉపయోగం లేదు...?

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి మాట్లాడుతూ చదువుకున్న నాయకుడు వస్తే నియోజకవర్గం రాత మారుతుంది..బడులు బాగుపడతాయి..మన పిల్లల భవిష్యత్తు బంగారు బాట అవుతుంది.."అని నమ్మి ఆ నియోజకవర్గ ప్రజలు ఒక ఉన్నత విద్యావంతుడిని తమ శాసనసభ్యుడిగా(ఎమ్మెల్యే) గెలిపించుకున్నారు,కానీ తీరా గెలిచాక ఆ ఎమ్మెల్యే పాలనలో నియోజకవర్గంలో విద్యారంగం అట్టడుగుకు పడిపోయింది, విద్యావంతుడైన నాయకుడి హయాంలోనే విద్య కరువైపోవడంపై స్థానిక బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి,విద్యార్థులు పై తరగతులు కి వెళ్తున్న కూడా విద్యా పై అవగాహన లేని పరిస్థితి ఏర్పడినది,హామీలు ఘనం..ఆచరణ శూన్యం!​ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద డిగ్రీలు చూపిస్తూ,"నేను చదువుకున్నవాడిని,ఉచిత విద్యా సౌకర్యాలు కల్పిస్తాను,ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దుతాను"అని సదరు నేత ఊదరగొట్టారు,కానీ గెలిచి ఏళ్లు గడుస్తున్నా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలల పరిస్థితి "అయ్యో పాపం" అనేలా తయారైంది,​​అ,ఆ లు కూడా తెల్వకుండా పై తరగతులు వెళ్తున్న విద్యార్థులు,మౌలిక వసతులు సున్నా,కనీసం తాగడానికి మంచి నీరు,విద్యార్థినులకు శౌచాలయాలు లేని పాఠశాలలు ఎన్నో ఉన్నాయి,వర్షాకాలం వస్తే కప్పులు కారుతు ప్రాంగణం చెరువులను తలపిస్తున్నాయి,​​"చదువుకోని నాయకుడైతే ఏదో తెలియక చేయలేకపోయాడనుకోవచ్చు,అన్ని డిగ్రీలు ఉన్న విద్యావంతుడు అయ్యి ఉండి కూడా మన పిల్లల చదువులను పట్టించుకోకపోవడం దారుణం,ఆయన చదువు ఆయనకే ఉపయోగపడింది తప్ప నియోజకవర్గ పిల్లలకి రూపాయి ఉపయోగం లేకుండా పోయింది,ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి నియోజకవర్గంలో విద్యారంగాన్ని బాగుచేయాలని బిజెపి పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని తంబళ్ల రవి తెలిపారు.

Previous రెంట్ ఎ బాయ్‌ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Next ఒక కుటుంబం ఆకలితో... శ్రీమాత సేవా ట్రస్ట్ సాయం విజ్ఞప్తి
ADVERTISEMENT